Begin typing your search above and press return to search.

దర్శకుడిగా సుకుమార్ కొత్త శిష్యుడు… ఒకేసారి 150 కోట్ల బడ్జెట్

సుకుమార్ దగ్గర వర్క్ చేసే వారిలో చాలా మంది దర్శకులుగా మారి సక్సెస్ అవుతున్నారు.

By:  Tupaki Desk   |   27 Aug 2024 9:37 AM GMT
దర్శకుడిగా సుకుమార్ కొత్త శిష్యుడు… ఒకేసారి 150 కోట్ల బడ్జెట్
X

సుకుమార్ దగ్గర వర్క్ చేసే వారిలో చాలా మంది దర్శకులుగా మారి సక్సెస్ అవుతున్నారు. తన శిష్యులు సిద్ధం చేసుకుంటున్న కథలు వింటూ వాటిని సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లోనే వేరొక నిర్మాణ సంస్థతో కలిసి తెరకెక్కించే బాధ్యత తీసుకుంటున్నారు. సుకుమార్ ఒక మాస్టర్ గా తన శిష్యులకి సినిమా మేకింగ్ లో టెక్నీకల్ నాలెడ్జ్ ఇవ్వడమే కాకుండా దర్శకులుగా వారికి ప్లేస్ మెంట్ కూడా ఇస్తున్నారని చెప్పొచ్చు.

ఇప్పటికే పల్నాటి సూర్య ప్రతాప్, బుచ్చిబాబు సానా, కార్తీక్ దండు, శ్రీకాంత్ ఓదేల లాంటి దర్శకులు సుకుమార్ ఇమేజ్ తో దర్శకులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. వీరందరూ సక్సెస్ అయ్యారు. బుచ్చిబాబు ఏకంగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే సుకుమార్ మరో శిష్యుడిని ఇప్పుడు దర్శకుడిగా పరిచయం చేయబోతున్నాడంట. ఇప్పటికే అతను చెప్పిన కథని ఒకే చేసిన సుకుమార్ తన హోమ్ బ్యానర్ సుకుమార్ రైటింగ్స్ లోనే అతన్ని పరిచయం చేయబోతున్నారు.

నిజానికి సుకుమార్ ఎక్కువగా మైత్రీ మూవీ మేకర్స్ తో కొలాబరేట్ అయ్యి సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. అయితే ఈ సారి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో టై అప్ అవుతున్నారంట. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే సుకుమార్ శిష్యుడి కోసం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా భారీ బడ్జెట్ పెట్టడానికి విశ్వప్రసాద్ సిద్ధం అవుతున్నారంట.

సుమారు 150 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో సినిమాకి సంబందించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉందంట. అయితే ఈ మూవీ జోనర్ ఏంటనేది ఎవరికి తెలియదు. సుకుమార్ ప్లానింగ్ చూస్తుంటే కచ్చితంగా నెక్స్ట్ జెనరేషన్ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ అందరూ కూడా అతని ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వారే ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

తాను స్టార్ డైరెక్టర్ గా పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ అందుకోవడమే కాకుండా తన దగ్గర వర్క్ చేసే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ఇమేజ్ ని సుకుమార్ బిల్డ్ చేస్తున్నారు. కథల ఎంపికలో కూడా సుకుమార్ కీలక భూమిక పోషించనున్నారు. సుకుమార్ తన ప్రొడక్షన్ హౌస్ సుకుమార్ రైటింగ్స్ కి ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు. తన ప్రొడక్షన్ నుంచి ఒక దర్శకుడు వస్తున్నాడంటే ఎన్ని కోట్లు పెట్టిన కచ్చితంగా రికవరీ వస్తుందనే కాన్ఫిడెన్స్ ని నిర్మాతలకి ఇస్తున్నారు. దీంతో ఇతర ప్రొడక్షన్ కంపెనీలు కూడా సుకుమార్ శిష్యులతో మూవీస్ చేయడానికి ముందుకి వస్తున్నాయి.