Begin typing your search above and press return to search.

పుష్ప 3, 4, 5, 6

‘పుష్ప’ మొదలైనపుడు అది ఒక్క సినిమానే. కానీ మధ్యలో ‘బాహుబలి’ తరహాలోనే దాన్ని కూడా రెండు భాగాలుగా చేయాలని సంకల్పించారు సుకుమార్ అండ్ కో.

By:  Tupaki Desk   |   22 Aug 2024 6:47 AM GMT
పుష్ప 3, 4, 5, 6
X

‘పుష్ప’ మొదలైనపుడు అది ఒక్క సినిమానే. కానీ మధ్యలో ‘బాహుబలి’ తరహాలోనే దాన్ని కూడా రెండు భాగాలుగా చేయాలని సంకల్పించారు సుకుమార్ అండ్ కో. ఫస్ట్ పార్ట్ హిట్టవడంతో సెకండ్ పార్ట్ మీద అంచనాలు పెరిగాయి. పుష్ప-2 డిసెంబరు 6న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

ఐతే ఈసారి కూడా కథ ముగియదని.. పార్ట్-3కి లీడ్ ఉంటుందని ఇండస్ట్రీలో ఓ చర్చ జరుగుతోంది. యూనిట్ వర్గాలు కూడా వీలును బట్టి సుకుమార్, బన్నీ మూడో పార్ట్ చేయాలనే ఆలోచనతోనే ఉన్నట్లు చెబుతున్నాయి. ఐతే తన భార్య తబిత సమర్పణలో వస్తున్న ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వచ్చిన సుకుమార్.. పుష్ప సినిమాకు ఇంకో నాలుగు పార్టులుంటాయని.. ఈ కథ ఎప్పటికీ ఆగదని చెప్పడం విశేషం.

‘ఆర్య’ సినిమాకు పార్ట్ తీశాక ఆపేసినట్లే ‘పుష్ప’ చిత్రాన్ని కూడా రెండో పార్ట్‌తో ఆపేస్తారా.. ఇంకో సినిమా ఉంటుందా అని యాంకర్ సుమ అడగ్గా.. పుష్ప-2 తర్వాత పుష్ప-3, 4, 5, 6 ఇలా సినిమాలు తీస్తూ వెళ్తానని సుకుమార్ నవ్వుతూ అన్నారు. కాగా పుష్ప-2 ఆలస్యం అవుతుండడం, మరోసారి వాయిదా పడుతుందని ఇటీవల జరిగిన ప్రచారాన్ని ఉద్దేశించి సుకుమార్ మాట్లాడుతూ.. ‘‘అభిమానులకు బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్ అందించడానికి మేం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం.

కొన్ని సన్నివేశాలు ఎక్కువ సమయం తీసుకుంటున్నాయి. అలాగే నాణ్యత విషయంలో నేను రాజీ పడను. అందువల్ల జాప్యం జరుగుతోంది. అంతే తప్ప వేరే కారణం లేదు. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు.. ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది” అని సుకుమార్ చెప్పుకొచ్చాడు. ఐతే సుకుమార్ జోక్‌గా అని ఉండొచ్చు కానీ.. పుష్ప-2 తర్వాత మూడో పార్ట్‌కు లీడ్ ఇచ్చినా.. సుకుమార్, బన్నీలకు కుదిరి పుష్ప-3 చేయడం సందేహమే అన్నది వారి సన్నిహిత వర్గాల సమాచారం.