Begin typing your search above and press return to search.

మెగా కాంపౌండ్ లోనే సుక్కు.. హీరో ఎవరు..?

రాజమౌళి వేసిన బాటలో పుష్ప తో పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు దర్శకుడు సుకుమార్

By:  Tupaki Desk   |   18 March 2024 5:54 AM GMT
మెగా కాంపౌండ్ లోనే సుక్కు.. హీరో ఎవరు..?
X

రాజమౌళి వేసిన బాటలో పుష్ప తో పాన్ ఇండియా డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు దర్శకుడు సుకుమార్. ఆర్య నుంచి పుష్ప 1 వరకు అతని డైరెక్షన్ లో సినిమాలు ఆడియన్స్ ని ఎప్పుడు డిజప్పాయింట్ చేయలేదు. తెలుగు సినిమా ఇప్పుడు పొందుతున్న ప్రశంసలు అందుకోవడంలో తన కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు సుకుమార్. పుష్ప 1 తో నేషనల్ లెవెల్ లో అదరగొట్టిన సుకుమార్ పుష్ప 2 తో మరో సంచలనానికి సిద్ధం అవుతున్నాడు. ఇక పుష్ప 2 తర్వాత సుకుమార్ ప్లాన్ పై పాన్ ఇండియా లెవెల్ లో డిస్కషన్స్ జరుగుతున్నాయి.

సుకుమార్ నెక్స్ట్ సినిమా కచ్చితంగా మెగా కాంపౌండ్ లోనే ఉంటుందని ఇప్పటికే హింట్స్ వచ్చాయి. అయితే మెగా కాంపౌండ్ అంటే అందులో ఉన్నది ఒకరిద్దరు హీరోలు కాదు. దాదాపు ఏడు ఎనిమిది మంది ఉన్నారు. వారిలో సుకుమార్ సినిమా చేసేది ఎవరన్నది తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ తో పుష్ప 2 పూర్తి చేయగానే కొద్దిపాటి గ్యాప్ లోనే సుకుమార్ తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ చేస్తాడని అంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు మెగా హీరోల్లో ఒకరితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు అంటే ఒకరు మెగాస్టార్ చిరంజీవి అయితే మరొకరు చిరుత రామ్ చరణ్. ఈ ఇద్దరిలోనే సుకుమార్ సినిమా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ రాం చరణ్ తో రంగస్థలం సినిమా చేశాడు సుకుమార్. చరణ్ లోని నటుడిని వెలికితీసి వారెవా అనేలా చేశాడు. ఇప్పుడు మరోసారి ఆ కాంబో రిపీట్ అవుతుందని అంటున్నారు. చరణ్ కూడా సుకుమార్ తో సినిమా అంటే రెడీ అనేస్తున్నాడు. అయితే శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్న చరణ్ ఆ తర్వాత సినిమా బుచ్చి బాబు డైరెక్షన్ లో ఫిక్స్ చేసుకున్నాడు.

త్వరలోనే RC 16వ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. అయితే బుచ్చి బాబు సినిమా చేసిన వెంటనే చరణ్ సుకుమార్ సినిమా చేసే అవకాశం లేదు. అందుకే సుకుమార్ చిరంజీవితోనే తన నెక్స్ట్ సినిమా చేసే ప్లాన్ లో ఉన్నారట. మెగాస్టార్ వీరాభిమాని అయిన సుకుమార్ చిరు తో సినిమా అంటే ఆ ప్రాజెక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించవచ్చు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ కాంబో సినిమాపై సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. చిరుతో సుకుమార్ చేసే సినిమా ఎలా ఉంటుందో చూడాలి.