Begin typing your search above and press return to search.

ఒక్కటి తక్కువైనా కష్టమే సుక్కు..

మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   16 April 2024 5:14 AM GMT
ఒక్కటి తక్కువైనా కష్టమే సుక్కు..
X

మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయిన విషయం తెలిసిందే. మాలీవుడ్ లో సూపర్ యాక్టర్ అయిన ఆయన.. కరోనా తర్వాత ఓటీటీ ద్వారా నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నారు. హీరోగా, యాక్టర్ గా, విలన్ గా కనిపిస్తూ తన నటనతో అదరగొడుతున్నారు. సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలో సత్తా చాటుతున్నారు.

ఇటీవల కోలీవుడ్ లో ఉదయనిధి స్టాలిన్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించిన మామన్నన్‌ చిత్రంలో విలనిజాన్ని పండించి ఆకట్టుకున్నారు. కమల్‌ హాసన్‌ విక్రమ్‌ మూవీలో కీలక పాత్రలో నటించి అందరినీ మెప్పించారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ వెట్టియాన్ (తెలుగులో వేటగాడు) మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్.. కమెడియన్ గా నటిస్తుండడం విశేషం.

తాజాగా ఆవేశం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఫహాద్ ఫాజిల్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ దక్కించుకుని దూసుకుపోతోంది. అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. త్వరలో తెలుగు వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ మూవీ హాట్ టాపిక్ గా మారింది. దీంతో అందరి దృష్టి పుష్ప-2 చిత్రంలో ఫహాద్ రోల్ పై పడింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల తోపాటు బన్నీ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న పుష్ప సీక్వెల్ లో ఫహాద్.. పోలీస్ అధికారి భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఫస్ట్ పార్ట్ లో ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ ఆయన రోల్ చాలా చిన్నగా ఉందని, షెకావత్ పాత్ర ఇంపాక్ట్ సినిమాపై లేదని అప్పట్లో చాలామంది కామెంట్ చేశారు. సుకుమార్ ఫహాద్ విషయంలో స్క్రిప్ట్ వర్క్ సరిగ్గా చేయలేదని అన్నారు.

పుష్ప తర్వాత నటించిన చిత్రాల్లో ఫహాద్ నటనను చూసి.. సుకుమార్ ఆయనను సరిగ్గా ఉపయోగించుకోలేని అనేక మంది అభిప్రాయపడ్డారు. ఇప్పుడు పుష్ప-2లో ఫహాద్ టాలెంట్ ను సుకుమార్ సరైన రీతిలో యూజ్ చేసుకుంటారని అంతా ఆశిస్తున్నారు. దీంతో ఫహాద్ టాలెంట్ ను సిల్వర్ స్క్రీన్ పై అద్భుతంగా చూపించే విషయంలో సుకుమార్ పై ఒత్తిడి ఉన్నట్లే.

అసలే పుష్పతో 1000 కోట్ల టార్గెట్ అంటున్నారు. యాక్షన్ ఏమోషన్ తో పాటు బన్నీ క్యారెక్టర్ అలాగే ఫహాద్ క్యారెక్టర్ కూడా బలంగా ఉండాల్సిందే. ఒక్కటి తక్కువైనా పేర్లు పెట్టేస్తారు. నెగిటివ్ కామెంట్ చేయడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు. మరి ఈసారి భన్వర్ సింగ్ పాత్రను సుకుమార్ ఎలా డిజైన్ చేశారో తెలియాలంటే ఆగస్టు 15వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.