Begin typing your search above and press return to search.

సుకుమార్ లెక్క తప్పుతుందా.. పుష్ప 2 ఏం జరుగుతుంది..?

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ విషయంలో కూడా ఇదే లెక్క తప్పుతుందని తెలుస్తుంది

By:  Tupaki Desk   |   16 Jun 2024 3:30 PM GMT
సుకుమార్ లెక్క తప్పుతుందా.. పుష్ప 2 ఏం జరుగుతుంది..?
X

సినిమా తీయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. కొందరు ఎంచుకున్న కథను అనుకున్న బడ్జెట్ వేసుకున్న షెడ్యూల్ ప్రకారం పర్ఫెక్ట్ గా తీస్తారు. అంతేకాదు ఫలితం కూడా తాము అనుకున్న విధంగా వచ్చేలా ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తారు. కానీ కొంతమంది దర్శకులు మాత్రం సినిమా అనుకున్న టైం లో వేసుకున్న షెడ్యూల్ ఒకలా ఉంటే సెట్స్ మీదకు వెళ్లాక పరిస్థితులు బట్టి మార్చేస్తారు. ఇదంతా సినిమా అవుట్ పుట్ బాగా రావడానికే అయినా కూడా ప్రేక్షకుల్లో కొంత అసంతృప్తి వస్తుంది.

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ విషయంలో కూడా ఇదే లెక్క తప్పుతుందని తెలుస్తుంది. పుష్ప 1 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సుకుమార్ ఆ సినిమా పార్ట్ 2 ని తెరకెక్కించడం కోసం ఇప్పటికే రెండేళ్లు టైం తీసుకున్నాడు. ఆగష్టు 15కి సినిమా రిలీజ్ అని నిన్న మొన్నటిదాకా గట్టిగా చెప్పిన సుకుమార్ ఇప్పుడు సినిమాను అనుకున్న డేట్ కి తీసుకు రావడం కష్టమని నిర్మాతలకు చెప్పడంతో సినిమా వాయిదా వేయాలా వద్దా అని మేకర్స్ ఆలోచనలో పడ్డారు.

పుష్ప 2 సినిమాపై మొన్నటిదాకా బీభత్సమైన పాజిటివిటీ ఉంది. కానీ ఈమధ్య జరిగిన కొన్ని సంఘటనల వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ కలిగేలా చేశాయి. ఇదే సినిమాపై ఎఫెక్ట్ పడేలా చేస్తాయని అనుకుంటే ఇప్పుడు రిలీజ్ వాయిదా అంటూ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్నారు. మొన్నటిదాకా ఎవరొచ్చినా రాకపోయినా పుష్ప రాజ్ మాత్రం పక్కా వస్తాడని ప్రమోట్ చేసిన మేకర్స్ ఇప్పుడు వాయిదా విషయాన్ని చెప్పేందుకు కూడా నీళ్లు నములుతున్నారు.

ఈ విషయాలన్నీ చూస్తే సుకుమార్ లెక్క తప్పుతుందని అనిపిస్తుంది. సరే సినిమా వాయిదా పడటం మంచిదే కానీ ఈ లేట్ అంతా కూడా సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తుంది. వాటికి ఏమాత్రం తక్కువ అయినా సినిమా ఫలితంలో తేడా వచ్చేస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో సుకుమార్ ఎలా డీల్ చేస్తాడు.. సినిమాను ఎలా తెరకెక్కిస్తున్నాడు అన్నది చూడాలి. అల్లు అర్జున్ కూడా పుష్ప 2 పై వస్తున్న ఈ నెగిటివిటీ ఎలా ఫేస్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. సుకుమార్ అల్లు అర్జున్ ఇద్దరు పుష్ప 2 కోసం తమ బెస్ట్ పెట్టేస్తున్నారు. కానీ కొన్ని అనుకోని సంఘటనలు సినిమాపై ఎఫెక్ట్ పడేలా చేస్తుండటంతో ఇలాంటి టైం లో వారు ఎలా ముందుకెళ్లాలనే ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది.