Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌న్ -సుమ‌ల‌త బాండింగ్ స‌న్ అండ్ మామ్!

అలాగే నేరుగా ద‌ర్శ‌న్ ని క‌లిసేందుకు జైలులో ములాఖ‌త్ కూడా అయ్యారు. ద‌ర్శ‌న్ ని ప‌రామ‌ర్శించి ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

By:  Tupaki Desk   |   7 July 2024 5:29 AM GMT
ద‌ర్శ‌న్ -సుమ‌ల‌త బాండింగ్ స‌న్ అండ్ మామ్!
X

మ‌ర్ద‌ర్ కేసులో శాండిల్ వుడ్ ఛాలెంజింగ్ స్టార్ ద‌ర్శ‌న ప‌రప్ప‌న్ అగ్ర‌హారం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌రిశ్ర‌మ నుంచి ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా కొంత మంది నిల‌వ‌గా మ‌ద్ద‌తుగా మ‌రికొంత మంది నిలిచారు. దీనిలో భాగంగా సుమ‌ల‌త కూడా ద‌ర్శ‌న్ పై త‌న న‌మ్మకాన్ని వ్య‌క్త చేస్తూ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఎలాంటి త‌ప్పు చేసి ఉండ‌డ‌ని, నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌స్తాడ‌ని ధీమా వ్య‌క్తం చేసారు.

అలాగే నేరుగా ద‌ర్శ‌న్ ని క‌లిసేందుకు జైలులో ములాఖ‌త్ కూడా అయ్యారు. ద‌ర్శ‌న్ ని ప‌రామ‌ర్శించి ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త‌న‌వైపు నుంచి అన్ని ర‌కాల స‌హకారం ఉంటుంద‌ని భ‌రోసా క‌ల్పిం చారు. మరి ఆరోప‌ణ‌లు ఎదుర్కోంటున్న ద‌ర్శ‌న్ పై సుమ‌లత ఇంత ప్రేమ చూపిస్తున్నారు? కార‌ణం ఏంటి? అంటే చాలా సంగ‌తే ఉంది. ద‌ర్శ‌న్ తో పాటు కేజీఎఫ్ స్టార్ య‌శ్ ని కూడా సుమ‌ల‌తో అంతే అభిమానిస్తారు.

య‌శ్ కంటే? ద‌ర్శ‌న్ పై మ‌రింత అభిమానంతో సొంత కుమారుడిలా భావిస్తారు. సుమ‌ల‌త రాజ‌కీయ ప్ర‌యాణం వెనుక ఆ ఇద్ద‌రు స్టార్లు ఎంతో కీల‌క పాత్ర పోషించారు. అలా ఆ ముగ్గురికి మ‌ధ్య మంచి బాండింగ్ ఏర్ప‌డింది. ఓ సంద‌ర్భంలో దర్శన్ , సుమ‌ల‌త తన తల్లిలాంటిద‌ని, ఆమె గీసిన గీతను జ‌వ‌దాట‌నని, బావిలోకి వెళ్లి దూకమని ఆమె చెప్పినా ఎందుకు అని అడ‌గ‌కుండా ఆ ప‌ని చేస్తాన‌న్నాడు. ఇది క‌న్న‌డ నాట అంద‌రికీ తెలిసిన వాస్త‌వ‌మే.

అలాంటి బాండింగ్ ఉన్న ద‌ర్శ‌న్ విష‌యంలో సుమలత‌ ఆల‌స్యంగా స్పందించార‌ని ఆయ‌న అభిమా నులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌న జైలుకెళ్లిన సంగ‌తి మ్యాండంకి ఇప్పుడే తెలిసిందా? అంటూ మండిప‌డుతున్నారు. ఇంత‌వ‌ర‌కూ ఎందుకు స్పందించ‌లేదో? చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు.