సుమంత్ 'అనగనగా'.. టీజర్ ఎలా ఉందంటే?
సుమంత్ తోపాటు కాజల్ చౌదరి, మాస్టర్ విహార్ష్, అవసరాల శ్రీనివాస్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
By: Tupaki Desk | 22 Feb 2025 5:43 PM GMTటాలీవుడ్ నటుడు సుమంత్.. ఒకప్పుడు హీరోగా అనేక మంచి సినిమాలను ఆడియన్స్ కు అందించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు త్వరలో లీడ్ రోల్ లో అనగనగా మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈటీవీ విన్ ఓటీటీలో ఆ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది.
సుమంత్ తోపాటు కాజల్ చౌదరి, మాస్టర్ విహార్ష్, అవసరాల శ్రీనివాస్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తుండగా.. రాకేష్ రెడ్డి, రుద్రా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుతున్నారు. ఉగాది కానుకగా మార్చి 30వ తేదీన స్ట్రీమింగ్ చేయనున్నారు.
అయితే ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్.. టీజర్ ను తీసుకొచ్చారు. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో శనివారం విడుదల చేసి గ్లింప్స్ ను రిలీజ్ చేయించారు. ఆయన టీమ్ కు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు. కథ అంటే ఏంటి అవి ఎందుకు అనే డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అయింది. సినిమాలో సుమంత్ టీచర్ గా కనిపించనున్నారు.
ఆయన బట్టి పట్టించుకుండా, ప్రెజర్ పెట్టకుండా విద్యను నేర్పిద్దామనుకుంటారు.
కానీ ఆయన భావాన్ని అంతా తప్పుగా అర్థం చేసుకుంటారు. దీంతో ఒంటరిగా పోరాడుతూ కనిపిస్తారు. మరి చివరికి ఏం జరిగిందనేది సినిమాగా తెలుస్తోంది. ఇప్పుడు టీజర్.. అందరినీ ఆకట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపి.. చిన్నారులకు ఏ విధంగా పాఠాలు బోధిస్తే, అర్థమవుతుందో చెప్పే ప్రయత్నం చేసినట్లు టీజర్ చూస్తుంటే క్లియర్ గా తెలుస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తెలుగు భాషా ప్రాముఖ్యతను,ఓ ఎమోషనల్ కంటెంట్ చెప్పబోతున్నట్లు కూడా ఉందని అంటున్నారు.
'పిల్లలకు బట్టి పట్టిస్తే చదువెలా వస్తుంది?', 'నోటితో విసిరేసి చేతులతో ఏరుకునేది ఏంటి?' అంటూ సుమంత్ చెప్పిన డైలాగ్స్ మెప్పిస్తున్నారు. పొడుపు కథ ఇంట్రెస్టింగ్ గా ఉంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. నేచరుల్ గా ఉండి ఆకట్టుకున్నాయి. సుమంత్ కూడా తన పాత్రలో ఒదిగిపోయి కనిపించారు. ఓవరాల్ గా టీజర్.. చాలా బాగుందని చెప్పాలి. అదే సమయంలో మూవీపై మంచి అంచనాలు కూడా క్రియేట్ అయ్యాయి.