సీక్వెల్ కి ఇంత 'లో' బజ్ ఏంటి..?
రెండేళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకులను అలరించింది.
By: Tupaki Desk | 25 March 2025 1:00 PMఓ పక్క స్టార్స్ తో సినిమాలు చేస్తూనే మరోపక్క లో బడ్జెట్ తో సినిమాలు చేయడం ప్రతి నిర్మాణ సంస్థ చేస్తున్న పనే. అందులో సితార బ్యానర్ ఈ లో బడ్జెట్ సినిమాలతో కూడా స్టార్ సినిమాల రేంజ్ ఇంపాక్ట్ కలిగేలా చేస్తున్నారు. అలా సితార బ్యానర్ నుంచి వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా మ్యాడ్. రెండేళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకులను అలరించింది. సినిమా యూత్ ఆడియన్స్ కి ఒక మంచి ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా ఎట్రాక్ట్ చేసింది.
సితార బ్యానర్ సత్తా ఏంటో మ్యాడ్ ప్రూవ్ చేసింది. కొత్త వాళ్లతో కూడా సినిమా తీసి సూపర్ హిట్ కొట్టారు. మ్యాడ్ సినిమాలో ఎన్ టీ ఆర్ బావమరిది నార్నె నితిన్ తో పాటు సంగీత్ శోభన్, రాం నితిన్ నటించారు. ఈ ముగ్గురు చేసిన హంగామా థియేటర్ లో నవ్వులు పూయించడమే కాదు సితార బ్యానర్ కు కాసుల వర్షం కురిపించింది.
మ్యాడ్ సినిమాలో సాంగ్స్ కూడా సూపర్ హిట్. భీమ్స్ మ్యూజిక్ ట్రాక్స్ తెగ వైరల్ అయ్యాయి. ఇక సినిమాలో కొన్ని ఫన్నీ సీన్స్ కోసం కూడా రిపీటెడ్ ఆడియన్స్ వచ్చారు. మ్యాడ్ సినిమా ఈ రేంజ్ సక్సెస్ అవ్వడంతో మ్యాడ్ స్క్వేర్ అంటూ ఆ సినిమా సీక్వెల్ ప్లాన్ చేశారు మేకర్స్. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన మ్యాడ్ సినిమా సక్సెస్ అందుకోవడంతో పాటు సీక్వెల్ అనగానే మరింత బాధ్యత మీద పెట్టినట్టు అయ్యింది.
ఒక సూపర్ హిట్ సినిమా సీక్వెల్ అంటే ముందు సినిమాకు మించి అంచనాలు ఏర్పడతాయి. మ్యాడ్ స్క్వేర్ విషయంలో కూడా అంతే మ్యాడ్ రేంజ్ కాదు అంతకుమించి ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిందే అని ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఐతే మ్యాడ్ స్క్వేర్ లో కూడా ఎంటర్టైన్మెంట్ విషయంలో ఢోకా లేదన్నట్టుగానే చెబుతున్నారు.
సినిమా ప్రమోషనల్ కంటెంట్ అయితే ఆడియన్స్ కి నచ్చింది. ఐతే మ్యాడ్ స్క్వేర్ సినిమా ఈ నెల 29న రిలీజ్ అవుతుంది. ఆ సినిమా తో పాటు మరో మూడు సినిమా అంటే ఒకటి తెలుగు స్టార్ సినిమా మరో రెండు డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. ఈసారి మ్యాడ్ స్క్వేర్ కి బాక్సాఫీస్ దగ్గర టఫ్ ఫైట్ ఉంటుంది.
మ్యాడ్ స్క్వేర్ తో పాటు బరిలో దిగుతున్న నితిన్ రాబిన్ హుడ్ ప్రమోషన్స్ ఒక రేంజ్ లో చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ చూస్తే నితిన్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. అంతేకాదు రాబిన్ హుడ్ సినిమాలో డైరెక్టర్ వెంకీ కుడుముల కామెడీ, యాక్టర్స్ టైమింగ్ ముఖ్యంగా శ్రీలీల, కెతిక గ్లామర్ తో పాటు డేవిడ్ వార్నర్ క్యామియో హైలెట్స్ కానున్నాయి. అందుకే ఆ సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో కూడా టాప్ లో ఉన్నారు.
ఇక ఆ సినిమాతో పాటు వస్తున్న మ్యాడ్ స్క్వేర్ కి మాత్రం అసలు బజ్ రావట్లేదు. మ్యాడ్ హీరోలు అదే నార్నె నితిన్, సంగీత్ శోభన్, రాం నితిన్ లు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నా పెద్దగా బజ్ రావట్లేదు. మ్యాడ్ స్క్వేర్ లో హీరోయిన్స్ లేరన్నట్టు నిర్మాత చెప్పారు. ప్రతి సిచ్యువేషన్ లో ఒక కొత్త అమ్మాయి ఉంటుందని అన్నారు.
బహుశా ప్రమోషన్స్ లో హీరోయిన్స్ లేకపోవడం వల్ల జనాలు పట్టించుకోవట్లేదా అన్న టాక్ కూడా ఉంది. మరోపక్క డబ్బింగ్ సినిమాలైన మోహన్ లాల్ ఎల్ 2 ఎంపురాన్, విక్రం వీర ధీర శూర సినిమాలు కూడా ఈ వీకెండ్ రేసులో బలంగా ఫైట్ చేసేందుకు వస్తున్నాయి.
ఎల్ 2 సినిమా ట్రైలర్ తో ఇంపాక్ట్ కలిగింది. ఎటొచ్చి మ్యాడ్ స్క్వేర్ విషయంలోనే మేకర్స్ ఎంత ప్రయత్నించినా కూడా ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రావట్లేదు.
మ్యాడ్ హిట్ కదా అని మ్యాడ్ స్క్వేర్ విషయంలో కాస్త బడ్జెట్ కూడా పెంచారని టాక్. సినిమా రిలీజ్ ప్రమోషన్స్ తో వస్తున్న బజ్ చూస్తేనేమో చాలా డల్ గా ఉంది. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటన్నది రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.
ఈ వీకెండ్ రిలీజ్ అవుతున్న సినిమాల్లో రాబిన్ హుడ్ కోసం నితిన్ ప్రమోషన్స్ చేస్తూ టాప్ ప్లేస్ లో సినిమాను ఉంచగా మోహన్ లాల్, పృధ్విరాజ్ సుకుమారన్ వరుస ఇంటర్వ్యూస్ తో ఎల్ 2 ఎంపురాన్ సినిమా మీద ఆసక్తి కలిగేలా చేశారు. అందుకే ఆడియన్స్ బజ్ విషయంలో టాప్ 2 గా ఎల్ 2 ఎంపురాన్ ఉంది. ఆ తర్వాత థర్డ్ ప్లేస్ లో మ్యాడ్ స్క్వేర్ ఉంది. మరి రిలీజ్ మరో 3 రోజులు ఉంది కాబట్టి మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచి జనాల్లో సినిమా వేళ్లేలా చేస్తారా లేదా అన్నది చూడాలి.
ఇదిలా ఉంటే ఈ సమ్మర్ మొదటి ఇంట్రెస్టింగ్ సినిమాల ఫైట్ ఈ వీకెండ్ జరుగుతుంది. ఏ సినిమాకు ఆ సినిమా చాలా ప్రత్యేకతతో వస్తున్నాయి. కచ్చితంగా ఈ వీకెండ్ సినీ ప్రియులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తాయని చెప్పొచ్చు.
కామెడీ, యాక్షన్, మాస్ ఇలా ఈ వారాంతరం సినిమాలన్నీ కూడా ఆసక్తికరమైన కథాంశాలతో వస్తున్నాయి. ఈ సినిమాల్లో ఏది బాక్సాఫీస్ దగ్గర విజేతగా నిలుస్తుంది అన్నది చూడాలి. ఐతే ఈమధ్య ఒకేసారి 3,4 సినిమాలు రిలీజైనా సరే నచ్చితే అన్నిటినీ హిట్ చేస్తున్నారు ఆడియన్స్.