టాప్ డైరెక్టర్ల లిస్ట్ లో చేర్చలేదని వాపోయిన డైరెక్టర్!
తన పేరు ఇప్పటివరకూ టాప్ డైరెక్టర్ల సరసన లేదన్నారు. ఎన్నో కమర్శియల్ సక్సస్ లున్నా? మంచి హిట్ దర్శకుల జాబాతాలో తన పేరు చేర్చలేన్నారు.
By: Tupaki Desk | 17 Jan 2025 7:30 PM GMTసుందర్ సి. కోలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలు తీసిన దర్శకుడు. దాదాపు మూడు దశబ్దాలుగా దర్శకుడిగా సేవలం దిస్తున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ తో 'అరుణా చలం' లాంటి సినిమా తీయడం సుందర్ కే సాద్యమైంది. అలాంటి హిట్లు సుందర్ ఖాతాలో ఎన్నో నమోదయ్యాయి. నటుడిగానూ సత్తా చాటాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్ర వేసాడు. గాయకుడిగా, నిర్మాతగానూ ఎన్నో సినిమాలకు పనిచేసాడు.
ఇటీవలే ఆయన డైరెక్ట్ చేసిన 'మదగజరాజా' కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఐదు రోజుల్లోనే 25 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. వాస్తవానికి ఇది 12 ఏళ్ల క్రితం తీసిన సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నారు. ఇలా విజయం అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. అందులో సుందర్ గ్రాండ్ సక్సెస్ అయ్యారు. అయితే ఈ విజయోత్సవంలో భాగంగా సుందరి సి. ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
తన పేరు ఇప్పటివరకూ టాప్ డైరెక్టర్ల సరసన లేదన్నారు. ఎన్నో కమర్శియల్ సక్సస్ లున్నా? మంచి హిట్ దర్శకుల జాబాతాలో తన పేరు చేర్చలేన్నారు. ఇంతవరకూ తనని ఎవరూ ప్రశంసించను కూడా లేదన్నారు. ఈ ఘటన తనని ఎంతో బాధకి గురి చేస్తుందన్నారు. కానీ తన సినిమా బిజినెస్ ఎలా జరుగుతుందన్నది కొన్న వారికి తెలుస్తుందన్నారు. తన సినిమాల ద్వారా చాలా మంది లాభపడ్డారని అన్నారు.
సినిమా ఆడి నిర్మాతకు నాలుగు రూపాయలు వస్తే చాలు అంతకు మంచిన ప్రశంస, అవార్డు తనకు మరొకటి అవసరం లేదని పేర్కొన్నారు. ఈ సమయంలో పక్కనే ఉన్నవారు..వేదిక ముందు ఉన్నవారంతా సుందర్ పనితనాన్నిప్రశంసించే ప్రయత్నంచేసారు. మీ సినిమాలు సాధించిన విజయాలే మీకో గొప్ప స్థానాన్ని ఎప్పుడో కల్పించాయని పలువురు అభిప్రాయపడ్డారు.