Begin typing your search above and press return to search.

హర్రర్ డైరెక్టర్ తో మాస్ రాజా న్యూ కాంబో

మాస్ మహారాజ్ రవితేజ హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   5 Oct 2024 4:23 AM GMT
హర్రర్ డైరెక్టర్ తో మాస్ రాజా న్యూ కాంబో
X

మాస్ మహారాజ్ రవితేజ హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది ‘ఈగల్’, ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలతో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. అయిన కూడా రవితేజ స్పీడ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మాస్ రాజా భాను భోగవరపు దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

రీసెంట్ గా రవితేజ షూటింగ్ లో గాయపడటంతో కొద్ది రోజులు చిత్రీకరణ వాయిదా పడింది. త్వరలో మరల షెడ్యూల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈ సినిమాలో రవితేజకి జోడీగా శ్రీలీల నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే ‘ధమాకా’ మూవీ వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇదిలా ఉంటే దీని తర్వాత మాస్ మహారాజ్ తమిళ్ దర్శకుడితో మూవీ చేసే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది. కోలీవుడ్ లో సుందర్ సి స్టార్ డైరెక్టర్ గా ఉన్నారు.

అతని దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరణ్మనై’ సిరీస్ కి తమిళనాట మంచి క్రేజ్ ఉంది. అతను దర్శకత్వంతో పాటు హీరో క్యారెక్టర్స్ కూడా చేస్తూ కోలీవుడ్ లో తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే సుందర్ సి దగ్గర రవితేజకి సరిపోయే కథ ఒకటి ఉందంట. త్వరలో రవితేజకి అతను స్టోరీ నేరేషన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది.

టాలీవుడ్ బడా నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందంట. అన్ని సెట్ అయితే రవితేజ 76వ చిత్రంగా ఈ సినిమా స్టార్ట్ అవ్వొచ్చని అనుకుంటున్నారు. సుందర్ సి ఎక్కువగా హారర్ లో ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి కథలు చెబుతారు. రవితేజ కూడా ఎంటర్టైన్మెంట్ తో కూడిన యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి వీరిద్దరి కాంబినేషన్ లో ఒక డిఫరెంట్ ప్రాజెక్టు వచ్చే ఛాన్స్ ఉంటుందని మాస్ రాజా ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

రవితేజ నుంచి ఒక సాలిడ్ సక్సెస్ ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ‘ధమాకా’ తర్వాత ఇప్పటి వరకు రవితేజకి సోలో హిట్ లేదు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో రవితేజ హిట్ కొడతాడని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. దాని తర్వాత సుందర్ సి ప్రాజెక్ట్ పైన కూడా నమ్మకంగా ఉన్నారు.