విశాల్.. సుందర్ సి.. మధ్య అసలేమైంది..?
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ డైరెక్టర్ సుదర్ సి ల మధ్య దూరం ఉంది అన్న వార్త అందరికీ తెలిసిందే. ఐతే అది ఇప్పుడు కాదు ఒకప్పుడు
By: Tupaki Desk | 7 Jan 2025 7:30 PM GMTకోలీవుడ్ స్టార్ హీరో విశాల్ డైరెక్టర్ సుదర్ సి ల మధ్య దూరం ఉంది అన్న వార్త అందరికీ తెలిసిందే. ఐతే అది ఇప్పుడు కాదు ఒకప్పుడు. విశాల్ తో సినిమా చేయాలని అనుకున్న సుందర్ సి కి కలుద్దామని అపాయింట్మెంట్ ఇచ్చి ఆ టైం లోనే బయటకు వెళ్లాడు. ఆ టైం లో విశాల్ మీద చాలా కోపం వచ్చిందని ఆ విషయాలను గుర్తు చేసుకున్నారు సుందర్ సి. విశాల్ తో సుందర్ సె మద గజ రాజా సినిమా చేశారు. ఆ సినిమా 2013 లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికి రిలీజ్ మోక్షం కలిగింది.
ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా విశాల్, సుందర్ సి మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి బయటకు వచ్చింది. విశాల్ తో సినిమా చేయాలని సుందర్ ప్రయత్నించారు. ఐతే ప్రొడక్షన్ వాళ్లు అతనితో మీటింగ్ ఏర్పాటు చేయగా అతన్ని కలుద్దామని ఆఫీస్ కు వెళ్తే అప్పటికే విశాల్ బయటకు వెళ్లాడు. ఐతే ఎంత వెయిట్ చేసినా సరే విశాల్ రాకపోయే సరికి సుందర్ సి హర్ట్ అయ్యారట.
ఐతే ఆ తర్వాత రెండు నెలల తర్వాత విశాల్ ఒక ఫంక్షన్ లో తనంతట తాను వచ్చి పలకరించాడని. ఐతే ఆ టైం లో ఆఫీస్ నుంచి ఎమర్జెన్సీగా వెళ్లాల్సి రావడంతో అలా చేయాల్సి వచ్చిందని అన్నారట. తనకు ఇష్టమైన హీరో కార్తీ తనకు అన్నయ్యగా భావిస్తానన్న సుందర్ సి విశాల్ తనకు తమ్ముడని అన్నారు. తనతో కన్నా విశాల్ తన భార్యతో స్నేహంగా ఉంటాడని అన్నారు. విశాల్ ఖుష్బూ మంచి స్నేహితులని అన్నారు సుందరి సి.
కోలీవుడ్ లో సుందర్ సి సినిమాల ఇంపాక్ట్ తెలిసిందే. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఆయన ప్రత్యేకమైన సినిమాలు చేస్తూ ఉంటారు. ఐతే మద గజ రాజ సినిమా రిలీజ్ టైం లో విశాల్ సుందర్ మధ్య ఈ గ్యాప్ కి కారణాన్ని సుందర్ సి వెల్లడించారు. ఐతే విశాల్ తో తాను తీసిన ఈ సినిమా ఇన్నాళ్లకు రిలీజ్ అవ్వడంపై విశాల్ ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు. ఐతే విశాల్ ప్రస్తుతం ఫీవర్ తో బాధపడుతున్నా సినిమా ప్రమోషన్స్ కోసం కష్టపడుతూ వచ్చారు. కనీసం మైక్ పట్టుకునే స్టామినా లేక ఆయన చేతులు వణుకుతూ కనిపించడం ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది.