సందీప్ కిషన్ అక్కడ పీపుల్స్ స్టార్ అయ్యాడా!
సందీప్ తమిళ్ లో ఫేమస్ అయినా అక్కడకు వెళ్తే తానెప్పుడు తెలుగు వాడినినే గర్వంగా చెప్పుకుని తిరుగుతాననన్నాడు.
By: Tupaki Desk | 23 Feb 2025 12:30 PM GMTయంగ్ హీరో సందీప్ కిషన్ కెరీర్ పరంగా ఎలాంటి సవాళ్లు ఎదుర్కున్నాడు? అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు నటుడైనా? తమిళ్ లోనే ఎక్కువ సినిమాలు చేసాడు. అక్కడ ప్రూవ్ చేసుకున్న తర్వాతే తెలుగులో అవకాశాలు వచ్చాయి. వెనుక ఛోటా కె. నాయుడు లాంటి కెమెరా మ్యాన్ ఉన్నా? అతడి సహకారం కేవలం లాంచింగ్ వరకే. ఆ తర్వాత ప్రతీ అవకాశాన్ని తానే సంపాదించుకుని సందీప్ నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు.
ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల చిత్రాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నాడు. అతడి మార్కెట్ కూడా రెట్టింపు అయింది. మునుపటి కంటే 15 రెట్లు పెరిగిందని సందీప్ చెబుతున్నాడు. అయితే తమిళ నాడులో ఫేమస్ అవ్వడంతో సందీప్ పై రీల్స్ కూడా వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. అయితే ఈ రీల్స్ చూసి నిర్మాత అనీల్ సుంకర తనని పీపుల్స్ స్టార్ గా పేరు పెట్టుకోమని సలహా ఇచ్చిన విషయాన్ని సందీప్ రివీల్ చేసాడు.
అయితే తన నిర్ణయాన్ని మాత్రం ఇంకా చెప్పలేదన్నాడు సందీప్. సందీప్ తమిళ్ లో ఫేమస్ అయినా అక్కడకు వెళ్తే తానెప్పుడు తెలుగు వాడినినే గర్వంగా చెప్పుకుని తిరుగుతాననన్నాడు. అలాగే తాను ఏదైనా సహాయం చేయాల్సి వస్తే తెలుగు ప్రజలకే ఎన్నో సందర్భాల్లో చేతనైన సహాయం చేసానన్నారు. ఇప్పటి వరకూ తమిళనాడులో రూపాయి కూడా సహాయం ఎక్కడా చేయలేదన్నారు.
అయినా తమిళ ప్రజలు తనని ఎంతో గొప్పగా ఆదరిస్తారని...అక్కడ హీరోలు తమతో కలిసి నటించే అవకాశం కల్పిస్తున్నారన్నారు. ధనుష్ `రాయన్` లో అవకాశం ఇచ్చిన తర్వాత అక్కడ ఓ అభిమాన సమూహం కోలీవుడ్ లో తనకు ఏర్పడిందని సందీప్ తెలిపాడు.