నా కెరీర్ లాంటి కేస్ స్టడీ ఇంకొకటి లేదు.
అప్పటి నుంచి తన సినిమాలతో అలరిస్తున్నారు. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
By: Tupaki Desk | 21 Feb 2025 10:25 AM GMTటాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్.. తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్థానం మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన టాలెంటెడ్ హీరో.. స్నేహగీతం చిత్రంతో హీరోగా మారారు. ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో సోలో కథానాయకుడిగా తన కెరీర్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి తన సినిమాలతో అలరిస్తున్నారు. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
"నేను ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు అవుతుంది.. బ్యూటిఫుల్ జర్నీ నేను ఎంబీఏ చదువుకున్నా.. నాకు కేస్ స్టడీస్ అంటే ఇష్టం.. ఒక కంపెనీ ఎలా ఉండేది.. ఎలా పడిపోయింది.. ఎలా లేచింది.. ముందుకు ఎలా వెళ్లగలదు.. ఏం చేయొచ్చు.. అనే అంశాలను నేను చదువుతా.. నా కెరీర్ అంతా యూనిక్" అని సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు.
"నా కెరీర్ లాంటి కేస్ స్టడీ ఇంకొకటి లేదు.. ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నా.. నేను చాలా మారాను.. ఇప్పుడు ఈరోజు ఒక గ్రేట్ డే.. బాధ్యత గల వ్యక్తిగా మారాను.. కొన్నేళ్ల క్రితం వ్యక్తికి ఇప్పుడికి చాలా డిఫరెన్స్ ఉంది.. 2010 ప్రస్థానం నుంచి 2014 వరకు బాగా సాగింది.. ఆ తర్వాత కాస్త బ్యాడ్ డేస్ వచ్చాయి" అని తెలిపారు.
"కెరీర్ లో ఇంకొంచెం బాగా చేస్తే బాగుంటుందని అనిపిస్తుంటుంది. అది కెరీర్ లో ఆ మాత్రం ఉండాలి.. చాలా మంది పోరాడుతున్నామని చెప్తారు. కానీ నేను అలా కాదు.. 15 ఏళ్ల నేను ఎప్పుడూ టాప్ డైరెక్టర్‌తో పని చేయలేదు, బ్లాక్ బస్టర్ ట్రెండ్ ను అనుసరించలేదు. టాప్ బ్యానర్ తో ఎప్పుడూ అనుబంధం కలిగి లేను " అని చెప్పారు.
"అనిల్ గారు రెస్పెక్ట్ ఇచ్చారు.. స్పేస్ కన్నా గౌరవం ఇస్తున్నారు.. అది నాకు ఇష్టం.. అందుకే మళ్లీ ఆయనతో పని చేస్తున్నాను అని చెప్పారు. ఆ తర్వాత సినిమా ప్రమోషన్స్ కోసం మాట్లాడారు సందీప్. సినిమా ఫంక్షన్స్ కు సెలెబ్రెటీలు తీసుకురావడం కష్టమని హోస్ట్ అనగా.. అది ప్రతి రోజు కష్టమని తెలిపారు సందీప్ కిషన్.
"15 ఏళ్ల కెరీర్ లో నా సినిమాల కోసం నా ఫ్రెండ్స్, నా ఏజ్ గ్రూప్ తప్ప ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. తొలిసారి చిరంజీవి గారి దగ్గరికి ఓ మూవీ గురించి వెళ్లాను. ప్రభాస్ అన్న దగ్గరకు కూడా వెళ్లాను. ఆయన నాకన్నా ఏడేళ్ల సీనియర్.. ఓ అన్న లాంటి వారు.. అయితే కొన్నేళ్లుగా ఇది జరుగుతుంది. సోషల్ మీడియా వల్ల ఇప్పుడు అందరికీ తెలుస్తుంది" అని చెప్పారు. పదేళ్ల క్రితం కూడా అలాగే ఉందని.. ఓపికతో పాటు ఇంట్రెస్ట్ ఉంటే ఫైట్ చేయొచ్చని సందీప్ కిషన్ అన్నారు.