రిలీజ్ కి ముందే అనవసరమైన ఎలివేషన్లు దేనికి?
కోలీవుడ్ కి ఇంత వరకూ 1000 కోట్ల క్లబ్ లో చేరని సంగతి తెలిసిందే. టాలీవుడ్, శాండిల్ వుడ్ ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయాయి.
By: Tupaki Desk | 1 March 2025 11:48 AM ISTకోలీవుడ్ కి ఇంత వరకూ 1000 కోట్ల క్లబ్ లో చేరని సంగతి తెలిసిందే. టాలీవుడ్, శాండిల్ వుడ్ ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లో చేరిపోయాయి. బాలీవుడ్ అయితే ఏకంగా 2000 కోట్ల క్లబ్ లోకూడా చేరిపోయింది. ప్రత్యేకం గా టాలీవుడ్ సినిమా అంటే పాన్ ఇండియాలో ఓ బ్రాండ్ గా మారిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ కి మాత్రం అలాంటి హిట్ ఒక్కటి కూడా లేదు. 600-650 కోట్ల మధ్యలోనే కోలీవుడ్ దమ్ము తేలిపోయింది. అప్పటి నుంచి 1000 కోట్లు కొట్టేదెలా? అని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు గానీ పనవ్వడం లేదు.
అందుకే 'జైలర్' కి సీక్వెల్ గా నెల్సన్ దిలీప్ కుమార్ 'జైలర్ 2' కూడా ప్రకటించాడు. 'జైలర్' 650 కోట్ల వరకూ రాబట్టడంతో 1000 కోట్లు 'జైలర్ 2' తో కొట్టాలన్నది ప్లాన్. అయితే అంతకంటే ముందే 'కూలీ'తో అది సాధ్యమవుతుందనే ధీమాని కోలీవుడ్ వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో అమీర్ ఖాన్, నాగార్జున, ఉపెంద్ర లాంటి స్టార్లు కూడా నటిస్తున్నారు. దీంతో ఆ స్టార్ హీరోల లాంగ్వెజెస్ ని కూడా బిజినెస్ పరంగా టార్గెట్ చేసినట్లు అయింది.
అయితే ఈ చిత్రంలో తెలుగు నటుడు సందీప్ కిషన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలొచ్చాయి. సందీప్ కిషన్ 'కూలీ' సెట్ నుండి చిత్రాన్ని పోస్ట్ చేయడంతో ఆయన ఎంట్రీ ఖాయమనుకున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటరాక్షన్ లో 'కూలీ'లో నటించడం లేదని, లోకేష్ కనగరాజ్ సన్నిహితుడు కావడంతోనే సెట్ ని విజిట్ చేసినట్లు తెలిపాడు. అలాగే సినిమా గురించి కూడా రివ్యూ ఇచ్చేసాడు. 'కూలీ' మొదటి 45 నిమిషాలను చూసానని అది ట్రీట్ లా ఉందన్నాడు. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసే చిత్ర మవుతుందని ధీమా వ్యక్తం చేసాడు.
అయితే సందీప్ ఇలా వ్యాఖ్యానించడం నెట్టింట విమర్శలకు దారి తీస్తోంది. 45 నిమిషాల పుటేజ్ చూసే? 1000 కోట్ల వసూళ్ల చిత్రం ఎలా అవుతుందని విమర్శిస్తున్నారు. సినిమా రిలీజ్కి ముందు ఇలాంటి ప్రకటనలు భావ్యం కాదని....అభిమానుల్ని మోసం చేసినట్లు అవుతుందని విమర్శలు ఎక్కు పెడుతున్నారు. 'కంగువ', 'గేమ్ ఛేంజర్' రిలీజ్ కు ముందు కూడా ఇలాంటి హైప్ క్రియేట్ చేసి టికెట్ కొనుగోలు చేసిన ప్రేక్షకుడిని మోసం చేసారని మండపడుతున్నారు. ఆ రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి? అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని స్టేట్ మెంట్లు ఇవ్వాలని అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.