Begin typing your search above and press return to search.

సందీప్ కిషన్.. ఈ కొత్త ట్యాగ్ ఏంటీ?

అయితే సందీప్ కిషన్ కెరియర్ లో చెప్పుకోదగ్గ కమర్షియల్ సక్సెస్ అంటే 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' మాత్రమే.

By:  Tupaki Desk   |   24 Sep 2024 4:18 AM GMT
సందీప్ కిషన్.. ఈ కొత్త ట్యాగ్ ఏంటీ?
X

టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు సందీప్ కిషన్. ‘ప్రస్థానం’ సినిమాతో నటుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన సందీప్ కిషన్ ‘రొటీన్ లవ్ స్టోరీ’ మూవీతో సోలో హీరోగా మారాడు. అక్కడి నుంచి గ్యాప్ లేకుండా మూవీస్ చేస్తున్నాడు. అయితే సందీప్ కిషన్ కెరియర్ లో చెప్పుకోదగ్గ కమర్షియల్ సక్సెస్ అంటే ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మాత్రమే.

కొన్ని సినిమాలు పర్వాలేదనే టాక్ వరకే ఆగిపోయాయి. అయితే నటుడిగా సందీప్ కిషన్ ప్రతి సినిమాలో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ మాత్రం ఇస్తూనే ఉన్నాడు. డిఫరెంట్ కథలని ఎంచుకుంటూ మూవీస్ చేస్తున్నాడు. చివరిగా తెలుగులో ‘ఊరు పేరు భైరవకోన’ మూవీతో సందీప్ కిషన్ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఎబౌవ్ ఏవరేజ్ గా నిలిచింది.

ఈ ఏడాది తమిళ్ మూవీ ‘రాయన్’ లో ధనుష్ తమ్ముడిగా నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. ఇదిలా ఉంటే సందీప్ కిషన్ ప్రస్తుతం త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ‘మజాకా’ అనే టైటిల్ ని ఈ సినిమాకి పెట్టారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సందీప్ కిషన్ కూడా ఇంగ్లీష్ లో న్యూమరాలజీ కలిసొచ్చే విధంగా తన పేరు మార్చుకున్నాడు.

మరో వైపు పేరు ముందు పీపుల్స్ స్టార్ అని ట్యాగ్ లైన్ యాడ్ చేసుకున్నాడు. ఈ ట్యాగ్ గతంలో ఆర్ నారాయణమూర్తికి ఉండేది. అతను ఎక్కువగా ప్రజల సమస్యలు, పోరాటాల నేపథ్యంలో సినిమాలు చేశారు. ఈ కారణంగా ఆర్ నారాయణమూర్తికి పీపుల్స్ స్టార్ అనే బిరుదు వచ్చింది. ఆ బిరుదుకి ఆర్ నారాయణమూర్తి పూర్తిగా న్యాయం చేశాడు.

అయితే ఎక్కువగా కమర్షియల్ జోనర్ లో సినిమాలు చేసే సందీప్ కిషన్ కి పీపుల్స్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఎంత వరకు యాప్ట్ అవుతుందనేది చెప్పలేం. పబ్లిక్ ని ఎంటర్టైన్ చేస్తాడనే కోణంలో సందీప్ కిషన్ కి పీపుల్స్ స్టార్ అనే బిరుదు ఏమైనా ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సందీప్ కిషన్ పీపుల్స్ స్టార్ అనే ట్యాగ్ లైన్ పెట్టుకోవడంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరోలు చాలామంది తమ పేరుకి ముందు ఏదో ఒక స్టార్ కలిసొచ్చే విధంగా ట్యాగ్ లైన్స్ పెట్టుకుంటున్నారు. అందుకే సందీప్ కిషన్ కూడా దీనిని ఫాలో అయినట్లు టాక్ వినిపిస్తోంది.