Begin typing your search above and press return to search.

సంక్రాంతి క్లాష్.. ఆ కుర్ర హీరోకు లక్కీ ఛాన్స్

సంక్రాంతి సీజన్.. సినిమా వాళ్లకు చాలా స్పెషల్ అనే చెప్పాలి. కచ్చితంగా ఏటా పొంగల్ కు అనేక చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి

By:  Tupaki Desk   |   24 Oct 2024 6:15 AM GMT
సంక్రాంతి క్లాష్.. ఆ కుర్ర హీరోకు లక్కీ ఛాన్స్
X

సంక్రాంతి సీజన్.. సినిమా వాళ్లకు చాలా స్పెషల్ అనే చెప్పాలి. కచ్చితంగా ఏటా పొంగల్ కు అనేక చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను అందుకుంటాయి. దీంతో మేకర్స్.. పొంగల్ సీజన్ పై ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. సంక్రాంతికే తమ చిత్రాలను రిలీజ్ చేయాలని భావిస్తుంటారు. అయితే వచ్చే ఏడాది పొంగల్ కు మొత్తం ఎన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయనేది ఇప్పటికీ ఇంకా ఫిక్స్ అవ్వలేదు.

అందరి కన్నా ముందు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర.. కర్చీఫ్ వేసుకోగా రీసెంట్ గా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అదే తేదీన స్టార్ హీరో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్.. రిలీజ్ కానుంది. సీనియర్ బాలకృష్ణ NBK 109 మూవీ కూడా సంక్రాంతికే విడుదల కానుంది. వెంకటేష్, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ మాత్రం వాయిదా పడేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ.. పోస్ట్ పోన్ అవ్వడం నిజమేనని టాక్ వినిపిస్తోంది.

అదే సమయంలో నాగచైతన్య.. తండేల్ మూవీ కూడా సంక్రాంతికి వస్తుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ మేకర్స్ రీసెంట్ గా తమ నిర్ణయాన్ని మార్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు యంగ్ హీరో సందీప్ కిషన్ మంచి ఛాన్స్ కొట్టేశారని సినీ వర్గాలు అంటున్నాయి. తండేల్ తప్పుకోవడంతో.. సందీప్ కిషన్ మజాకాకు థియేటర్లు బాగా దొరుకుతాయని చెబుతున్నాయి.

గేమ్ ఛేంజర్ ను తెలుగు రాష్ట్రాల్లోని 50 శాతానికి పైగా థియేటర్ల విడుదల చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. స్పెషల్ అండ్ బెనిఫిట్ షోలు వేయనున్నారట. అదే సమయంలో బాలయ్య మూవీకి 25 శాతం థియేటర్లు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మజాకా.. మిగతా థియేటర్లలో ఎక్కువ భాగం దక్కించుకోనుందన్నమాట. మాస్ ఎంటర్టైనర్‌ గా త్రినాథరావు నక్కిన ఆ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే దాదాపు మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్న మజాకాను ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో రీతూ వ‌ర్మ హీరోయిన్‌ గా న‌టిస్తుండగా.. రావు రమేశ్, మన్మథుడు ఫేమ్ అన్షు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. మరి సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న మజాకా మూవీ.. సందీప్ కిషన్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.