Begin typing your search above and press return to search.

సందీప్ కిషన్ సినిమాల బిజినెస్ ట్రాక్.. టాప్ లో మజాకా

టాలీవుడ్‌లో యువ హీరో సందీప్ కిషన్ తన కెరీర్ జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నప్పటికీ ఇంకా అనుకున్నంత రేంజ్ లో మార్కెట్ పెంచుకోవడం లేదు.

By:  Tupaki Desk   |   25 Feb 2025 1:53 PM GMT
సందీప్ కిషన్ సినిమాల బిజినెస్ ట్రాక్.. టాప్ లో మజాకా
X

టాలీవుడ్‌లో యువ హీరో సందీప్ కిషన్ తన కెరీర్ జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నప్పటికీ ఇంకా అనుకున్నంత రేంజ్ లో మార్కెట్ పెంచుకోవడం లేదు. ఇక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా ప్రతీసారి విభిన్నమైన సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా సందీప్ నటించిన మజాకా మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్‌గా, అన్షూ ముఖ్య పాత్రలో నటించారు.

ఇక సినిమా సినిమా ఫిబ్రవరి 26న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. కామెడీ మాస్ డ్రామాగా మేళవించిన ఈ చిత్రం సందీప్ కిషన్‌కు మంచి హిట్ అందిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సందీప్ కిషన్ మాస్ అవతార్‌లో కనిపించడం కొత్తగా ఉంది. ఇక సినిమా డైరెక్టర్ హీరో కాంబినేషన్ కారణంగా సినిమాకు మంచి బిజినెస్ అయితే జరిగింది.

'మజాకా' థియేట్రికల్ హక్కులు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 9 కోట్లకు అమ్ముడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 10.50 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా 11 కోట్ల షేర్ అందుకుంటేనే హిట్ అయినట్లు లెక్క. ప్రస్తుతం పోటీగా పెద్ద సినిమాలు ఏమి లేవు. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది.

అలాగే ఇది హిట్ అయితే, సందీప్ కిషన్ కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

గతంలో సందీప్ కిషన్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలు అందుకున్నాయి. ముఖ్యంగా ఊరు పేరు భైరవకోన, మైఖేల్, గల్లి రౌడీ, A1 ఎక్స్‌ప్రెస్ సినిమాలు ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగా మోస్తరుగా ఉండగా, మజాకా మాత్రం బిజినెస్ పరంగా ముందంజలో నిలిచింది. ఇది సందీప్ కిషన్ మార్కెట్ పెరుగుతున్నదనడానికి నిదర్శనం.

ఇకపోతే, సందీప్ కిషన్ ఇటీవల చేసిన సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను పరిశీలిస్తే:

మజాకా: ₹10.50 కోట్లు

ఊరు పేరు భైరవకోన: ₹10.20 కోట్లు

మైఖేల్: ₹6.50 కోట్లు

గల్లి రౌడీ: ₹2.75 కోట్లు

A1 ఎక్స్‌ప్రెస్: ₹4.60 కోట్లు