Begin typing your search above and press return to search.

సందీప్ కిషన్‌కి ఆ సమస్య... సర్జరీ అవసరం!

సందీప్ కిషన్‌ సక్సెస్ ఫ్లాప్‌ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. గత ఏడాది ధనుష్ దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాయన్‌ సినిమాలో కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

By:  Tupaki Desk   |   21 Feb 2025 7:30 AM GMT
సందీప్ కిషన్‌కి ఆ సమస్య... సర్జరీ అవసరం!
X

సందీప్ కిషన్‌ సక్సెస్ ఫ్లాప్‌ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. గత ఏడాది ధనుష్ దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాయన్‌ సినిమాలో కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో సందీప్‌ కిషన్‌ తెలుగుతో పాటు తమిళ్‌లోనూ మరోసారి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. తాజాగా మజాకా అనే సినిమాలో నటించిన సందీప్‌ కిషన్‌ ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో మజాకా సినిమా రూపొందింది.

మజాకా సినిమా ప్రమోషన్‌లో భాగంగా తన కెరీర్‌ స్ట్రగుల్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పలువురు నిర్మాతలు ఫోన్ ఎత్తడం లేదని, సినిమాలు చేద్దామని చెప్పిన వారు కనిపించడం లేదని, ఒక వేళ కలిసినా మొహం చాటేస్తున్నారని, చేద్దామని హామీ ఇచ్చి ఆ తర్వాత కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన వద్దకు వచ్చిన మంచి కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ప్రతి సినిమాతోనూ విభిన్నంగా ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తాను అంటూ సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు. అదే ఇంటర్వ్యూలో తనకు ఉన్న అనారోగ్య సమస్య గురించి చెప్పుకొచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు.

సినిమాల్లో చాలా యాక్టివ్‌గా కనిపించే సందీప్‌ కిషన్‌ కి సైనస్ అనే తీవ్రమైన అనారోగ్య సమస్య ఉందట. ఆ సమస్య వల్ల నిద్ర పోయిన సమయంలో ముక్కు నుంచి వెనక భాగం వరకు బ్లాక్‌ అవుతుంది. దాంతో ఊపిరి పీల్చుకోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది. లేచిన వెంటనే ఎవరితోనూ మాట్లాడలేను. ఇంట్లో వారితోనూ కనీసం మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. లేచిన తర్వాత కొంత సమయం వరకు వేడి టీ తాగి, మెడిటేషన్‌ చేస్తూ చిన్న చిన్న వర్కౌట్‌లు చేస్తాను అన్నాడు. ఈ సమస్య కొన్ని సార్లు ఇబ్బంది పెడుతున్నా ఆపరేషన్‌కి భయపడుతున్నట్లు సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు.

సైనస్ సమస్య నుంచి బయటకు రావడానికి ముక్కు ఆపరేషన్‌ చేయించుకోవాల్సి ఉంది. ఆపరేషన్ తర్వాత ముక్కు షేప్‌ మారుతుందేమో అనే భయంతో, కొన్నాళ్ల పాటు షూటింగ్స్‌కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆపరేషన్‌ చేయించుకోవడం లేదు. ఆపరేషన్ తర్వాత మొహం ఎలా మారుతుందో అనే ఆందోళనతోనూ సైనస్ ఆపరేషన్‌కి భయపడుతున్నట్లు సందీప్‌ కిషన్ తెలియజేశాడు. ఇప్పుడు కాకున్నా ఇంకా కొన్నాళ్ల తర్వాత అయినా సైనస్ కోసం ఆపరేషన్‌ చేయించుకోవాలని భావిస్తున్నట్లు సందీప్ కిషన్‌ అన్నాడు. మజాకాతో మరోసారి ఒక ఫుల్‌ లెంగ్త్‌ వినోదాత్మక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు సందీప్ కిషన్‌ తెలియజేశారు.