Begin typing your search above and press return to search.

'మజాక' క్యూట్ జోడి.. వైరల్ మీమ్

ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు.

By:  Tupaki Desk   |   27 Oct 2024 11:25 AM GMT
మజాక క్యూట్ జోడి.. వైరల్ మీమ్
X

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్.. వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. సినీ ప్రియులను ఓ రేంజ్ లో అలరిస్తూ దూసుకుపోతున్నారు. 2024లో ఇప్పటికే ఊరు పేరు భైరవకోన చిత్రంతో వచ్చి హిట్ అందుకున్నారు. కోలీవుడ్ చిత్రాలు రాయన్, కెప్టెన్ మిల్లర్ లో క్యామియో రోల్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. మజాకా మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు.

త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న మజాకా మూవీ.. కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సిద్ధమవుతోంది. అయితే ఇప్పటి వరకు హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారో మేకర్స్ రివీల్ చేయకపోవడంతో సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. వాటికి చెక్ పెడుతూ రీసెంట్ గా హీరోయిన్ పేరును రివీల్ చేశారు. యంగ్ బ్యూటీ రీతూ వర్మనే హీరోయిన్ అని అనౌన్స్ చేశారు.

సూపర్ టాలెంటెండ్ రీతూ వర్మకు స్వాగతం.. పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్, రీతూ వర్మ పెయిర్.. సినిమాకు హార్ట్.. అంటూ మేకర్స్ పోస్ట్ పెట్టారు. దాంతో పాటు ఒక వీడియోను షేర్ చేశారు. అందులో పెళ్లికూతురి గెటప్‌ లో ఉన్న రీతూ వర్మ అలిగి బీచ్ ఒడ్డున కూర్చున్నారు. దీంతో ఆమెను సరదాగా ఆటపట్టిస్తున్నారు సందీప్ కిషన్. వీడియో క్యూట్ గా ఆకట్టుకుంటుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. సినిమాలో రీతూ వర్మ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నట్లు అర్థమైందని చెబుతున్నారు.

సంక్రాంతికి మజాకా మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మరోసారి మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. ప్రస్తుతం వైజాగ్ లో చిత్రీకరణ జరుపుతున్నారు. 20 రోజుల పాటు జరిగే షెడ్యూల్‌‌ లో యాక్షన్‌‌ సీన్స్‌‌ తో పాటు లీడ్ యాక్టర్స్‌‌ పై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. హీరోయిన్ ను రివీల్ చేస్తూ పోస్ట్ చేసిన వీడియో కూడా వైజాగ్ లో షూట్ చేసినదే.

ఇక సినిమా విషయానికొస్తే.. ప్రసన్న కుమార్ కథను అందించగా.. లియోన్ జేమ్స్ బాణీలు సమకూరుస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌‌ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. నిజార్‌ షఫీ సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరి పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న మజాకా మూవీ.. ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.