Begin typing your search above and press return to search.

ప్యారడైజ్‌... సందీప్‌ కిషన్ భలే లక్కీ

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ విభిన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ చేస్తూ ఉన్న విధానం ఎంతో మందికి ఆదర్శం.

By:  Tupaki Desk   |   7 Dec 2024 9:51 AM GMT
ప్యారడైజ్‌... సందీప్‌ కిషన్ భలే లక్కీ
X

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ విభిన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ చేస్తూ ఉన్న విధానం ఎంతో మందికి ఆదర్శం. కమర్షియల్‌గా సక్సెస్ అయినా కాకున్నా మంచి సినిమా చేశాడు అనే పేరును ఇప్పటికే పలు సార్లు సందీప్‌ కిషన్ దక్కించుకున్నాడు. ఇలా చాలా అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఆ అరుదైన అవకాశం సందీప్ కిషన్‌కి మాత్రమే దక్కింది అనడంలో సందేహం లేదు. ఆయన విభిన్న చిత్రాలు చేయడంతో పాటు సోషల్‌ మీడియాలో, ఇతర మీడియాల్లో విభిన్నంగా కనిపిస్తూ ఉంటారు. ఆయన ఇప్పుడు ఒక బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొత్త అవతారం ఎత్తాడు.

హైదరాబాద్‌లో బావర్చి బిర్యానీ ఎంత ఫేమసో అంతే ప్యారడైజ్ బిర్యానీ ఫేమస్‌ అనే విషయం తెల్సిందే. దేశ విదేశాల్లోనూ ప్యారడైజ్ బిర్యానీ గురించిన చర్చ జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్యారడైజ్ బిర్యానీకి మొదటి బ్రాండ్‌ అంబాసిడర్‌గా హీరో సందీప్ కిషన్‌ చేయడం జరిగింది. ప్యారడైజ్‌కి మొదటి బ్రాండ్‌ అంబాసిడర్‌ అనే బ్రాండ్‌ సందీప్‌ కిషన్‌కి ఎప్పటికీ ఉంటుంది. అందుకే ఈ విషయంలో సందీప్‌ కిషన్ లక్కీ అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. సినిమాలు చేస్తూనే హీరోలు ఇలా బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా చేయడం కామన్‌ అయ్యింది. ఎంతో మంది హీరోల మాదిరిగానే సందీప్ కిషన్‌ సైతం ఇలా బ్రాండింగ్‌ మొదలు పెట్టాడు.

సందీప్ కిషన్ బ్రాండింగ్‌లో ప్యారడైజ్ బిర్యానీకి ఏ స్థాయి పబ్లిసిటీ దక్కుతుంది అనేది చూడాలి. ఇక సందీప్ కిషన్‌ సినిమాల విషయానికి వస్తే ధనుష్ ప్రతిష్టాత్మక మూవీ రాయన్‌ లో కీలక పాత్రలో కనిపించాడు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందించి హీరోగా నటించిన రాయన్‌లో సందీప్ కిషన్ పాత్ర విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తాగుబోతు పాత్రలో సందీప్‌ కిషన్‌ చాలా మాస్‌గా నటించి భలే అనిపించాడు అంటూ సినిమా రివ్యూవర్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ సినిమా ప్రమోషన్‌ సమయంలోనే ఇకపై సహాయక పాత్రల్లో నటించను అంటూ చెప్పుకొచ్చాడు.

ఇతర హీరోల సినిమాల్లో ఇక పై నటించను అని చెప్పిన కొన్ని నెలల్లోనే మరోసారి ఇతర హీరో సినిమాలో నటించేందుకు రెడీ కావాల్సి వచ్చింది. సోషల్‌ మీడియాలో గత కొన్ని రోజులుగా రజనీకాంత్‌ కూలీ సినిమాలో సందీప్ కిషన్‌ కీలకమైన గెస్ట్‌ రోల్‌లో కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమాలో నాగార్జున సైతం నటిస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు తమిళ్‌తో పాటు తెలుగులోనూ బ్యాక్ టు బ్యాక్‌ సినిమానుల సందీప్‌ కిషన్‌ చేస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా తమిళ్ సూపర్ స్టార్‌ విజయ్‌ తనయుడు జాసన్‌ దర్శకత్వంలోనూ సందీప్‌ కిషన్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది సందీప్‌ కిషన్‌ కి చాలా కీలకంగా చెప్పుకోవచ్చు.