Begin typing your search above and press return to search.

బన్నీ, ధనుష్, విజయ్.. సందీప్ కిషన్ ఏమన్నాడంటే!

ఇండస్ట్రీలో తాను ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యానో తెలిపారు.

By:  Tupaki Desk   |   21 Feb 2025 5:30 PM GMT
బన్నీ, ధనుష్, విజయ్.. సందీప్ కిషన్ ఏమన్నాడంటే!
X

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ గురించి అందరికీ తెలిసిందే. 15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన.. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలతో ఆడియన్స్ ను అలరించారు. ఇప్పుడు మరింతగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో తాను ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యానో తెలిపారు.

" నేను ఎదిగేటప్పుడు కొన్ని సినిమాలు, కొందరు హీరోలు చూసి ఇలా అవ్వాలి కదా అని అనిపించింది. నేను వాళ్లను చూసి ఇన్స్పైర్ అయ్యా. రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, షారుక్ గారు, ధనుష్ అన్న, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ నుంచి ప్రేరణ పొందా. వాళ్ల నుంచి బాగా ఇన్స్పైర్ అయ్యా " అని సందీప్ కిషన్ తెలిపారు.

" అందుకు కారణాలు కూడా వివరించారు. రజినీకాంత్ గారు, చిరంజీవి గారు, షారుక్ గారు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారు. ఆ తర్వాత ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఏలుతున్నారు. బ్రౌన్ స్కిన్ టోన్ ఉన్న ఫస్ట్ సూపర్ స్టార్ రజినీకాంత్. అందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను. షారుక్ ఖాన్ కూడా అంతే " అని చెప్పారు.

" హిందీలో బ్రౌన్ స్కిన్ టోన్ ఉన్న సూపర్ స్టార్ షారుక్ గారు.. ధనుష్ అన్న, అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్ విషయానికొస్తే.. వారి ఫస్ట్ సినిమా నుంచి ప్రెజెంట్ వరకు వాళ్ల మారే విధానం నాకు ఆదర్శం. వాళ్ల గట్స్ చూసి ఇన్స్పైర్ అయ్యా. దళపతి విజయ్ గారు అంటే నాకు ఎంతో ఇష్టం " అని సందీప్ కిషన్ వెల్లడించారు.

" ఆయన ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు వచ్చిన మాటలకు.. ఇప్పుడు తన తీరు తీర్చిదిద్దుకున్న విధానానికి.. ప్రస్తుతం జనాలతో ఉన్న విధానం నుంచి చాలా ప్రేరణ పొందానని సందీప్ తెలిపారు. చిరంజీవి గారి నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. ఇదే అసలైన విధానాలు అనిపిస్తుంటుంది " అని సందీప్ కిషన్ అన్నారు.

ప్రస్తుతం సందీప్ కిషన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన పలువురు హీరోల గురించి వివరించిన విషయాలు.. అక్షరాలా నిజమని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. సందీప్ కిషన్.. యూనిక్ హీరో అని కొనియాడుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని హిట్స్ అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇప్పుడు మజాకాతో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు సందీప్ కిషన్.