100 కోట్ల హిట్టు.. మళ్ళీ చిన్న హీరోనే..?
సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవకోన సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాకి పర్వాలేదనే టాక్ వస్తోంది.
By: Tupaki Desk | 23 Feb 2024 3:59 AM GMTత్రినాథరావు నక్కిన ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా వినిపిస్తోన్న పేరు. సినిమా చూపిస్త మామా, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమేరా, ధమాకా సినిమాలతో వరుస కమర్షియల్ సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. కమర్షియల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కథలతో హిట్ మీద హిట్ అందుకుంటున్నాడు. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్ కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉందని చెప్పాలి. ముఖ్యంగా ధమాకా సినిమా 100 కోట్ల కలెక్షన్స్ అందుకొని అతని క్రేజ్ ని మరింత పెంచింది.
విక్టరీ వెంకటేష్ తో త్రినాథరావు నక్కిన నెక్స్ట్ మూవీ ఉంటుందనే ప్రచారం కొంతకాలం నుంచి నడిచింది. అలాగే నాగార్జునతో కూడా సినిమా చేస్తారనే ప్రచారం నడిచింది. ఎందుకనో అవేవీ కూడా పట్టాలు ఎక్కలేదు. ఆయనకి ఉన్న సక్సెస్ లకి స్టార్ హీరోలతో మూవీస్ చేసే అవకాశం ఉంది. డేట్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. నానితో కూడా త్రినాథరావు నక్కిన సినిమా చేయనున్నాడు అంటూ కథనాలు వినిపించాయి.
అయితే ఇప్పుడు సందీప్ కిషన్ తో త్రినాథరావు నక్కిన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు అందరూ కూడా కాస్తా అడ్వాన్స్ గా వెళ్లి కొత్త కథలతో మూవీస్ చేస్తున్నారు. రొటీన్ కమర్షియల్ జోనర్ నుంచి బయటకొచ్చి పాన్ ఇండియా అప్పీల్, యూనివర్సల్ థాట్స్ తోనే మూవీస్ చేస్తున్నారు. త్రినాథరావు నక్కినకి పెద్ద హీరోల నుంచి ఛాన్స్ లు రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం అనే మాట వినిపిస్తోంది.
సందీప్ కిషన్ తాజాగా ఊరు పేరు భైరవకోన సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాకి పర్వాలేదనే టాక్ వస్తోంది. థ్రిల్లర్ జోనర్ లో వచ్చి ఆడియన్స్ ని మెప్పిస్తోంది. చాలా కాలం తర్వాత సందీప్ ఖాతాలో భైరవకోన సినిమాతో సక్సెస్ పడేలానే కనిపిస్తోంది. ఇప్పుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో అంటే మేగ్జిమమ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అయ్యే అవకాశమే ఉంటుంది.
ఈ జోనర్ లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మాత్రమే సందీప్ ఖాతాలో హిట్ బొమ్మగా ఉంది. తరువాత చాలా ప్రయత్నాలు చేసిన వర్క్ అవుట్ కాలేదు. ఈ సారి త్రినాథరావు నక్కినతో సూపర్ హిట్ కొట్టే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఆయన ట్రాక్స్ రికార్డ్ బట్టి సినిమాపైనే కూడా బజ్ క్రియేట్ కావొచ్చు. అయితే ఈ సినిమాకి ప్రసన్న కుమార్ కథ అందిస్తున్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.