Begin typing your search above and press return to search.

సందీప్ కిషన్ కూడా బడ్జెట్ పెంచేశాడు..?

టాలీవుడ్ యంగ్ హీరోలలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు సందీప్ కిషన్.

By:  Tupaki Desk   |   7 May 2024 4:00 AM GMT
సందీప్ కిషన్ కూడా బడ్జెట్ పెంచేశాడు..?
X

టాలీవుడ్ యంగ్ హీరోలలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు సందీప్ కిషన్. ప్రస్థానం సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసిన సందీప్ కిషన్ తర్వాత హీరోగా మారాడు. అయితే సందీప్ కిషన్ కెరియర్ లో చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ హిట్స్ లేవు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 14 ఏళ్ళు అవుతున్న కేవలం ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ అతని ఖాతాలో ఉంది.

అది వెంకటాద్రి ఎక్స్ ప్రెస్. ఆ మూవీ సందీప్ కిషన్ కి కెరియర్ పరంగా బూస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత చాలా సినిమాలు చేసిన ఆశించిన స్థాయిలో సక్సెస్ లు అందుకోలేదు. సందీప్ కిషన్ సినిమాలు కథపరంగా పర్వాలేదనే టాక్ తెచ్చుకున్న కమర్షియల్ గా మాత్రం పెద్దగా రికార్డ్స్ ఏమి క్రియేట్ చేయలేదు. అయితే చాలామంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత సందీప్ కిషన్ కి దక్కుతుంది.

కోలీవుడ్ ని ప్రస్తుతం రూల్ చేస్తోన్న లోకేష్ కనగరాజ్ ని నగరం సినిమాతో సందీప్ కిషన్ దర్శకుడిగా పరిచయం చేశాడు. ఇదిలా ఉంటే గత ఏడాది భైరవకోన సినిమాతో సందీప్ కమర్షియల్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత మరోసారి సందీప్ కిషన్ థ్రిల్లర్ జోనర్ లోనే మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. భైరవకోన చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర ఈ మూవీ కూడా నిర్మిస్తూ ఉండడం విశేషం.

భైరవకోన సక్సెస్ తో ఈ సారి అనిల్ సుంకర ఏకంగా 25 కోట్ల బడ్జెట్ ని సందీప్ కిషన్ మీద ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఈ మూవీ కోసం సందీప్ కిషన్ రెమ్యూనరేషన్ తక్కువగా తీసుకున్నా కూడా మెజారిటీ బడ్జెట్ అవుట్ పుట్ మీద పెడుతున్నట్లుగా టాక్.

ఇప్పటికే మూవీ షూటింగ్ 50% కంప్లీట్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. సందీప్ కిషన్ కూడా కెరియర్ లో మరో బ్లాక్ మాస్టర్ హిట్ ఖాతాలో వేసుకోవడానికి ఈసారి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట.

భైరవకోన సక్సెస్ తర్వాత సందీప్ కిషన్ కథల విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇది కాకుండా త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ కూడా సందీప్ కిషన్ చేయబోతున్నాడు. ప్రసన్నకుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. అలాగే మరో రెండు కథలు చర్చలో దశలో ఉన్నట్లు సమాచారం.