Begin typing your search above and press return to search.

దర్శకుడిగా, హీరోగా... ఒకే నెలలో రెండు సినిమాలు!

విశాల్‌ ఫ్యాన్స్ ఆ సినిమా గురించి పూర్తిగా మరచి పోయారు. చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా ఆ సినిమా గురించే ఆలోచించని సమయంలో రిలీజ్‌కి రెడీ అయ్యింది.

By:  Tupaki Desk   |   19 Jan 2025 4:30 PM GMT
దర్శకుడిగా, హీరోగా... ఒకే నెలలో రెండు సినిమాలు!
X

తమిళ్‌లో ఇటీవల విశాల్‌ హీరోగా అంజలి, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ హీరోయిన్స్‌గా నటించిన 'మదగజరాజా' సినిమా విడుదలైంది. పొంగల్ రేసులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన ఆ సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఆ సినిమా దాదాపు 12 ఏళ్ల క్రితం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. విశాల్‌ ఫ్యాన్స్ ఆ సినిమా గురించి పూర్తిగా మరచి పోయారు. చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా ఆ సినిమా గురించే ఆలోచించని సమయంలో రిలీజ్‌కి రెడీ అయ్యింది.

మదగజరాజా సినిమాకు సుందర్‌ సి దర్శకత్వం వహించారు. విశాల్‌ హీరోగా సుందర్‌ సి దర్శకత్వంలో అప్పట్లో రూపొందిన మదగజరాజా సినిమా సంక్రాంతి విజేతగా తమిళనాట నిలిచింది. త్వరలోనే తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని అంటున్నారు. సుందర్ సి ఈ మధ్య కాలంలో దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ ఎక్కువ పేరు సొంతం చేసుకుంటున్నాడు. తమిళనాట నటుడిగా సుందర్‌ సి దూసుకు పోతున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు ఎప్పుడో తీసిన మదగజరాజా సినిమా హిట్‌ కొట్టడంతో మరింత బూస్ట్‌ ఇచ్చినట్లు అయ్యింది.

మదగజరాజా సినిమాతో పొంగల్‌కి దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుందర్‌ సి ఈ రిపబ్లిక్ డేకి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుందర్ సి నటించిన వల్లన్‌ సినిమాను జనవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మణి సేయన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కమల్‌ కామరాజు, హెబ్బ పటేల్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు నటించారు. ఈ సినిమాలో సుందర్‌ సి హీరోగా నటించాడు. సినిమాలో సుందర్‌ సి పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది అంటూ దర్శకుడు మణి సేయన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

సుందర్‌ సి అనగానే గత పదేళ్లుగా హర్రర్‌ సినిమాలు, థ్రిల్లర్‌ సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. కనుక ఈ సినిమా సైతం అదే జోనర్‌ అని అంతా అనుకుంటున్నారు. అంతా అనుకున్నట్లుగానే ఈ సినిమా థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో సాగుతుంది. విభిన్నమైన కథ, కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. సుందర్‌ సి కి తెలుగులోనూ ఈమధ్య ఫాలోయింగ్‌ మొదలైంది. అందుకే ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తెలుగు డబ్బింగ్‌ విషయమై క్లారిటీ రాలేదు. త్వరలోనే ఆ విషయమై స్పష్టత వస్తుందేమో చూడాలి.