ఆ హాట్ సింగర్ కి డబ్బు అంటే అంత చేదా?
డబ్బంటే ఎవరికి చేదు. వస్తుందంటే తీసుకుని ఎంచక్కా జేబులో పెట్టుకుంటాం.
By: Tupaki Desk | 4 Aug 2024 12:30 PM GMTడబ్బంటే ఎవరికి చేదు. వస్తుందంటే తీసుకుని ఎంచక్కా జేబులో పెట్టుకుంటాం. అదేమి ఉచితంగా ఇచ్చేది కాదు కదా. పనికి తగ్గ ప్రతిఫలం డబ్బు రూపంలో అందుతుంది. కానీ ఆ ప్రతి ఫలం కూడా ఆశించని వారు ఎవరైనా ఉన్నారా? అంటే ముందుగా ఈ బాలీవుడ్ సింగర్ సినీద్ చౌహాన్ చెప్పుకోవాలి ఏమో. అవును అమ్మడు డబ్బు ఇస్తామన్నా తీసుకోనని అంటోంది. వివరాల్లోకి వెళ్తే... `ఒక స్థాయికి చేరుకున్న తర్వాత అవతలి వారు డబ్బు ఇవ్వకుండా ఎస్కేప్ అవ్వడం పెద్దగా జరగదు.
ఎందుకంటే డబ్బు ఇచ్చాక పాడతాను అని డిమాండ్ చేయోచ్చు. అదే మనంతట మనమే ముందే పాట పూర్తి చేద్దాం అనుకుంటే మాత్రం డబ్బు గురించి ఆలోచించవద్దు. పారితోషికం గురించి అస్సలు ఆలోచించవద్దు. నేను అయితే ఇప్పటికీ చాలా సినిమలకు పారితోషికం తీసుకోలేదు. అలాగని వాళ్లు నాకు ఇవ్వలేదని కాదు. ఇవ్వాలని ప్రయత్నించారు కానీ నేను కావాలనే తీసుకోలేదు. వాళ్లు ఇచ్చేది నాకంత సంతృప్తిగా అనిపించలేదు.
నాకు కావాల్సింది డిమాండ్ చేసి చివరికి మళ్లీ వారి ఈగోను హర్ట్ చేయడం అని తీసుకోకుండా ఊరుకునే దాన్ని. కొన్నిసార్లు చివరి నిమిషంలో సింగర్లను మార్చేస్తారు. కానీ ఆ విషయం నాకు కాల్ చేసి కూడా చెప్పరు. కొన్ని పాటలైతే ముందుగానే రికార్డు చేసి పెడతారు. అవసరాన్ని బట్టి ఆయా సినిమాల్లో వాడుకుంటారు. ఇక అమ్మడి కెరీర్ సంగతి చూస్తే పదేళ్లగా సినిమాలకు దూరంగా ఉంటుంది.
మధ్యలో కొన్ని రియాల్టీ షోలు చేసి బాగా ఫేమస్ అయింది. చివరిగా 2018 లో దిల్ హై హిందుస్తానీ సీజన్ 2 లో నటించింది. ఆ తర్వాత మళ్లీ అవకాశాలు రాలేదు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండదు. వివాహం తర్వాత ధాంపత్య జీవితానకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. అవకాశాలు వచ్చినా కొన్ని సినిమాలు తానే వదులుకున్నాను గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.