Begin typing your search above and press return to search.

తండ్రి వెయిట‌ర్‌గా ప‌ని చేసిన మూడు బిల్డింగులు కొనేశాడు

తన తండ్రి క్యాటరింగ్ పరిశ్రమలో పనిచేసిన మూడు భవనాలను తాను కొన్నానని తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు.

By:  Tupaki Desk   |   19 Jun 2024 2:45 AM GMT
తండ్రి వెయిట‌ర్‌గా ప‌ని చేసిన మూడు బిల్డింగులు కొనేశాడు
X

బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి త‌న తండ్రి స్ఫూర్తివంత‌మైన జీవితం గురించి మీడియా ఎదుట మాట్లాడారు. తన తొమ్మిదేళ్ల వయసులో మంగుళూరులో ఇంటి నుండి పారిపోయిన తర్వాత తన తండ్రి అనుభవించిన కఠినమైన జీవితం గురించి వెల్ల‌డించాడు. తొలుత రెస్టారెంట్ లో క్లీన‌ర్ గా చేరాడు. తన తండ్రి మొదట్లో టేబుల్స్ తుడిచిపెట్టేవాడని, ఆపై రెస్టారెంట్ మేనేజర్‌గా, చివరికి యజమానిగా మారాడని చెప్పాడు. ఇప్పుడు అదే రెస్టారెంట్ య‌జ‌మానిగా ప్ర‌పంచ స్థాయికి తీర్చిదిద్దాడ‌ని వెల్ల‌డించారు. తన తండ్రి క్యాటరింగ్ పరిశ్రమలో పనిచేసిన మూడు భవనాలను తాను కొన్నానని తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు.

హాస్యనటి భారతీ సింగ్ ఆమె భర్త హర్ష్ లింబాచియాతో పోడ్‌కాస్ట్‌లో సునీల్ శెట్టి పై విష‌యాల‌ను వెల్ల‌డించారు. ``మా నాన్న చిన్నతనంలో పారిపోయి ముంబైకి వచ్చాడు. అతడికి తండ్రి లేరు.. కానీ ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. అతడికి సౌత్‌లో పని దొరికింది. తొమ్మిదేళ్ల వయసులో భారతీయ రెస్టారెంట్ లో చేరాడు. నాన్న మొదటి పని టేబుల్‌లను శుభ్రం చేయడం... అతడు అన్ని వైపులా శుభ్రం చేయడానికి నాలుగు రౌండ్లు వేయాలి. బియ్యం వేసే గోనె సంచితో టేబుల్స్ తుడవాలి.. అని అన్నాడు.

ఒక్కో మెట్టు ఎక్కే కొద్దీ.. ఎదుగుతున్నప్పుడు తన తండ్రి అద్భుత‌మైన పట్టుదల ప్రదర్శించారని సునీల్ చెప్పాడు. అతడి బాస్ మూడు బిల్డింగ్‌లు కొన్నాడు. చివరికి వాటిని మేనేజ్ చేయమని నాన్నను అడిగారు. బాస్ రిటైర్ అయినప్పుడు, నాన్న ఆ మూడు బిల్డింగ్‌లు కొన్నాడు. ఈ రోజు నా దగ్గర మూడు బిల్డింగ్‌లు ఉన్నాయి. అక్కడే (ఆ బిల్డింగుల్లోనే) మా ప్రయాణం మొదలైంది. తన తండ్రి విజయాలు సాధించే క్ర‌మంలో తాను ఏమీ చేయలేదని సునీల్ శెట్టి చెప్పాడు. త‌న తండ్రికి ఎలాంటి స‌హ‌కారిగా లేన‌ని అన్నాడు.

అనేక ఉద్యోగాల‌ తర్వాత 1992లో సునీల్ శెట్టి తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. సునీల్ తన తండ్రితో పాటు క్యాటరింగ్ వ్యాపారంలో చాలా సంవత్సరాలు పనిచేసినప్పటికీ తన తండ్రి తనను గెలిపించమని కోరాడని చెప్పాడు. మా నాన్న చాలా వినయంగా ఉండే వ్యక్తి.. కానీ తన పిల్లలకు లేదా అతని సిబ్బందికి వ్యతిరేకంగా ఎవరైనా ఒక మాట మాట్లాడినా అతడు సింహంలా మారతాడు. అతడికి ఒక లైన్ ఉంటుంది. బెచ్ దాలుంగా సబ్ కుచ్ కో, గావ్ చలే జౌంగా, పర్ నైన్సాఫీ నహీ జెలుంగా (నేను అన్నీ అమ్మేసి మా గ్రామానికి తిరిగి వెళ‌తాను కానీ అన్యాయాన్ని సహించను! ) అనేది అత‌డి నినాదం. సునీల్ తండ్రి 2017లో చనిపోయాడు. ఒక గొప్ప వ్య‌క్తిత్వం ఉన్న తండ్రికి బిడ్డ‌గా సునీల్ శెట్టి ఒక మంచి స్థాయికి ఎదిగాడు . తాను ఎంచుకున్న న‌ట‌నా రంగంలో అగ్ర హీరోగా ఎదిగి, ద‌శాబ్ధాల త‌ర్వాత కూడా సినీరంగంలో ప్ర‌భావం చూపుతున్నాడు.