'కల్కి' : 8 అడుగుల అశ్వథామ డూప్ ఇతడే
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
By: Tupaki Desk | 29 Aug 2024 8:30 PM GMTప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థియేటర్ లో విడుదల అయ్యి రెండు నెలలు గడిచిన తర్వాత ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. సౌత్ భాషల్లో అమెజాన్ ప్రైమ్ కల్కిని స్ట్రీమింగ్ చేయగా, హిందీ వర్షన్ ను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయడం జరిగింది. నెట్ ఫ్లిక్స్ లో ఇంగ్లీషేతర సినిమాల్లో అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకుంటున్న సినిమా గా కల్కి నిలిచింది. సౌత్ లో కూడా కల్కి ప్రభంజనం కొనసాగుతోంది.
మహాభారతం తో ఈ సినిమాకు లింక్ చేయడంతో పాటు, మహాభారతంలో అత్యంత కీలకమైన అశ్వథామ పాత్రను కల్కి లో చూపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణ మనుషుల మాదిరిగా కాకుండా అశ్వథామ ను ఎనిమిది అడుగులు చూపించడం జరిగింది. అమితాబచ్చన్ ను 8 అడుగులు చూపించి ఆశ్చర్యపరిచారు. గ్రాఫిక్స్ లో అమితాబ్ ను అలా చూపించి ఉంటారని అంతా అనుకున్నారు. కానీ ఎక్కువ శాతం సన్నివేశాల్లో ఎనిమిది అడుగులు ఉన్న మనిషినే నటింపజేయడం జరిగిందట. అమితాబచ్చన్ కి డూప్ గా జమ్మూ కాశ్మీర్ కి చెందిన సునీల్ కుమార్ నటించాడు.
జమ్మూ కశ్మీర్ పోలీస్ శాఖ లో కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్న సమయంలో సునీల్ కుమార్ కి సినిమాల్లో నటించే అవకాశం దక్కిందట. కల్కి సినిమాతో పాటు పలు హిందీ సినిమాల్లో కూడా సునీల్ నటించాడు. తాజాగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న సంచలన చిత్రం స్త్రీ 2 లో కూడా సునీల్ కుమార్ నటించాడు. సర్కటగా స్త్రీ 2 లో కనిపించిన సునీల్ కుమార్ తో తాజాగా శ్రద్దా కపూర్ తీసుకున్న ఫోటో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడి ముందు శ్రద్ద కపూర్ మరగుజ్జు అమ్మాయి అన్నట్లు చిన్నగా కనిపిస్తుందంటే అతడి ఎత్తు ఏంటో అర్థం చేసుకోవచ్చు.
వరుసగా సినిమాల్లో వస్తున్న ఆఫర్ల నేపథ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సునీల్ కుమార్ మాట్లాడుతూ కల్కి అనుభవాలను షేర్ చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి నేను అమితాబ్ సర్ ఫ్యాన్. నేను మాత్రమే కాకుండా నా కుటుంబ సభ్యులు మొత్తం అమితాబ్ జీ ఫ్యాన్స్. అలాంటి అమిత్ జీ కి డూప్ గా నటించాలి అన్నప్పుడు సర్‌ప్రైజ్ అయ్యాను. కల్కి సినిమా సెట్స్ లో మొదటి రోజు అడుగు పెట్టిన విషయం ఎప్పటికి మరచి పోలేను. ప్రభాస్, అమితాబ్ గారు కలిసి కూర్చుని ఉన్నారు. నన్ను చూడగానే నా వద్దకు వచ్చి మాట్లాడారు. ఆ రోజును నేను ఎప్పటికీ మరచిపోలేను. కల్కి సినిమా కోసం పలు యాక్షన్ సన్నివేశాల్లో నేను నటించాను. చాలా రోజుల పాటు షూటింగ్ లో పాల్గొనే అవకాశం దక్కింది.