Begin typing your search above and press return to search.

40కి పైగా ఫ్లాపుల న‌టుడు అంబానీకి పొరుగువాడు!

స్టార్ అయ్యాక వ‌చ్చిన అపార‌సంప‌ద‌తో ఇటీవ‌ల త‌న తండ్రి ప‌ని చేసిన హోట‌ల్ భ‌వంతుల‌నే కొనేసాడు.

By:  Tupaki Desk   |   27 July 2024 1:30 PM GMT
40కి పైగా ఫ్లాపుల న‌టుడు అంబానీకి పొరుగువాడు!
X

అతడు ఒక‌ప్పుడు స్టార్. కానీ కెరీర్ లో అత్య‌ధిక ఫ్లాప్ సినిమాల‌తో రికార్డ్ ఉంది. దాదాపు 40 పైగా చిత్రాలు ఫ్లాపుల‌య్యాయి. కానీ అత‌డు అంబానీ ఇంటికి పొరుగు వాడు. ధ‌నికుల సామ్రాజ్యంలో అత‌డు ఒక‌డుగా ఉన్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే...


ఆ స్టార్ మ‌రెవ‌రో కాదు.. ది గ్రేట్ సునీల్ శెట్టి. ఒక హోట‌ల్లో వెయిట‌ర్ గా ప‌ని చేసిన వ్య‌క్తికి అత‌డు కుమారుడు. కానీ తాను మాత్రం స్వ‌యం కృషితో పెద్ద స్టార్ అయ్యాడు. స్టార్ అయ్యాక వ‌చ్చిన అపార‌సంప‌ద‌తో ఇటీవ‌ల త‌న తండ్రి ప‌ని చేసిన హోట‌ల్ భ‌వంతుల‌నే కొనేసాడు. 125 కోట్లు పైగా ఆస్తుల‌తో ధ‌నిక న‌టుల్లో ఒక‌డిగా ఉన్నాడు. 40కి పైగా ఫ్లాప్ చిత్రాలను అందించినా ఇప్పటికీ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఆసియాలో నంబ‌ర్ వ‌న్ ధ‌నిక వ్యాపారి ముఖేష్ అంబానీకి పొరుగున ఉంటున్నాడు.

1992లో 31 ఏళ్ల వయసులో దివ్య భారతి సరసన `బల్వాన్` చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టాడు. 30 సంవత్సరాల పాటు సాగిన కెరీర్‌లో సునీల్ శెట్టి 100 పైగా చిత్రాల‌లో నటించారు. 90లలో అత్యధిక పారితోషికం పొందిన నటులలో ఒకడిగా ఉన్నారు. సునీల్ శెట్టికి సినిమాలతో పాటు ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. అతడు పాప్‌కార్న్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని. పాప్‌కార్న్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై `ఖేల్ - నో ఆర్డినరీ గేమ్` (2003), రఖ్త్ (2004), భాగమ్ భాగ్ (2006)తో సహా పలు చిత్రాలను నిర్మించాడు. తన నటనా జీవితంలో సునీల్ శెట్టి 40 ఫ్లాప్ చిత్రాలలో పనిచేశాడు. కానీ ఇప్పటికీ విలాసవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.

సునీల్ శెట్టికి మహారాష్ట్రలో అనేక ఆస్తులు ఉన్నాయి - ఖండాలాలో ఒక ఫామ్‌హౌస్ .. ముంబైలో విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. సునీల్ శెట్టి ముంబై ఇల్లు అల్టామాంట్ రోడ్‌లో ఉంది. పృథ్వీ అపార్ట్‌మెంట్స్‌లోని అతడి ఇల్లు ఐశ్వర్యానికి ఒక‌ ఉదాహరణ. నిజానికి ఆల్టామౌంట్ రోడ్ లో భారతదేశంలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ నివ‌శిస్తారు. ఆ రోడ్ లో ఒక ల్యాండ్ మార్క్ ప‌ర్స‌నాలిటీ అత‌డు. అంబానీ ఇంటి స‌మీపంలోని సునీల్ శెట్టి ముంబై ఇల్లు సుమారు 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. అక్కడ అత‌డు తన భార్య మనా శెట్టి, కుమారుడు అహన్ శెట్టితో కలిసి నివసిస్తున్నాడు. స్టార్ ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్‌ని పెళ్లాడాక‌ వారి కుమార్తె మాత్రం అత్తారింటికి వెళ్లిపోయింది.

సునీల్ శెట్టి ముంబై ఇల్లు లగ్జరీకి డెఫినిష‌న్.. ఈ ఇంటిని అందమైన పెయింటింగ్స్ ఫ్యామిలీ ఫోటోల‌తో అలంక‌రించారు. స‌క‌ల సౌక‌ర్యాలు ఇందులో ఉన్నాయి. సునీల్ శెట్టి అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి ముంబై స్కైలైన్ మొత్తాన్ని వీక్షించ‌వ‌చ్చు. సునీల్ శెట్టి ఇంటిలో ఒక వ్యక్తిగ‌త‌ గుహ కూడా ఉంది. ఇందులో కుటుంబ ఫోటోగ్రాఫ్‌లు , ఫిల్మ్ పోస్టర్‌లు ఉన్నాయి. సునీల్ శెట్టి ఇల్లు లగ్జరీ- సౌకర్యాల సమ్మేళనం. ఇందులో ఖరీదైన ఫర్నిచర్, సోఫాలు అత్యాధునిక సాంకేతికత నిండిన డిజైన‌ర్ వ‌స్తువుల‌తో.. ఆధునిక జీవనంపై సునీల్ శెట్టికి ఉన్న ప్రేమ అభిరుచిని ప్రతిబింబిస్తుంది.