చిరంజీవి అంతటోడు.. భార్యతో తిట్టు చీవాట్లు!
అయితే తాజా ఇంటర్వ్యూలో అతడి భార్య మాట్లాడుతూ.. మేమిద్దరూ ఒకరితో ఒకరు కీచులాడుకుంటామని, తిట్టుకుంటామని తెలిపింది.
By: Tupaki Desk | 28 Dec 2024 1:30 PM GMTభార్యభర్తల నడుమ కీచులాటలు చాలా సహజం. ఒకరికొకరు మనస్ఫర్థలతో తిట్టుకోవడం అలగడం ఇవన్నీ సహజంగా ఉండేవే. కానీ ఒక్కోసారి అవి అదుపుతప్పి రోడ్డున పడ్డ జంటలు ఉన్నారు. అలా కాకుండా సర్ధుకుపోయి ఒకరికోసం ఒకరుగా తుది కంటా నిలబడిన జంటలు ఉన్నారు. విడిపోయిన జంటల గురించి ప్రస్థావన ఎందుకు కానీ, ఇప్పుడు కలిసే ఉంటూ తిట్లు చీవాట్లు పెట్టుకుని ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలను కనబరిచే ఒక జంట గురించి కచ్ఛితంగా ముచ్చటించుకోవాలి.
అతడు హిందీ సినీపరిశ్రమలో ప్రముఖ హీరో. ఖాన్ ల త్రయం, అమితాబ్ అంతటి పెద్ద స్టార్లు ఉన్న పరిశ్రమలో అతడు తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకుని అగ్రహీరోగా ఎదిగాడు. అతడి నడక నడత ప్రతిదీ నవ్విస్తాయి. అతడి డ్యాన్సుల్లో ఈజ్ ఎనర్జీ ఆశ్చర్యపరుస్తాయి. దేశ వ్యాప్తంగా హృదయాలను గెలుచుకున్న గొప్ప కామెడీ హీరో. ఇప్పటికీ అతడు తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని మెయింటెయిన్ చేస్తున్నాడు.
ఇటీవల రాజకీయాల్లోను యాక్టివ్ గా ఉన్నాడు. అలాంటి హీరో గురించి తన భార్య చెప్పిన సంగతులు నిజంగా ఆశ్చర్యపరిచాయి. నిజానికి ఈ జంట ఆమె 15 ఏళ్ల వయసుకే కలుసుకున్నారట. ఆ ఏజ్ లో ఆమెను చూసాక అతడు తనలోని ఆవేశ పూరిత వైఖరి, ప్రత్యేక ఆకర్షణకు పడిపోయాడట. ఆ ఇద్దరూ విభిన్న ప్రపంచాల నుండి వచ్చినప్పటికీ ప్రేమ పల్లవించింది. పెద్దల అంగీకారంతో ఇద్దరూ 1987లో పెళ్లి చేసుకున్నారు. వారికి ముచ్చటగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి బంధంలో చాలా అప్స్ డౌన్స్ ఉన్నాయి. అలకలు కలతలు ఉన్నాయి. కానీ వారి ప్రేమ బలంగా నిలబడింది. మెగాస్టార్ చిరంజీవిలా 160 సినిమాల స్టార్ గా ఎదగడంలో తనకు భార్య అండదండలు ఉన్నాయి. బాలీవుడ్ లో అతడికి విక్టరీ వెంకటేష్ రేంజులో గొప్ప కామెడీ హీరోగా గుర్తింపు ఉంది.
అయితే తాజా ఇంటర్వ్యూలో అతడి భార్య మాట్లాడుతూ.. మేమిద్దరూ ఒకరితో ఒకరు కీచులాడుకుంటామని, తిట్టుకుంటామని తెలిపింది. అసలు మేం భార్యాభర్తల్లా ఉండలేమని కూడా అన్నారు. ఒకరినొకరు తిట్టుకోవడం వారి సంభాషణలో భాగం. సింగులర్ లో తిట్టుకుంటారు. ముక్కు సూటితనం ఉన్న ఆ హీరో భార్య పెళ్లి తర్వాత భర్త మోసం గురించి కూడా మాట్లాడింది. మీ భాగస్వామి అమాయకుడని, మోసం చేయడు అని ఎప్పుడూ చెప్పకండి.. అని కూడా ఆమె అంటుంది. తన భర్త తనను మోసం చేస్తే సీన్ చాలా ఘోరంగా మారుతుందని కూడా అన్నారు. అతడికి రాణి ముఖర్జీ, మాధురీ ధీక్షిత్, దివ్య భారతి, రవీనా టాండన్ వంటి కథానాయికలతో ఆమ్యామ్యా నడిచిందని కూడా పరిశ్రమలో గుసగుసలు ఉన్నాయి. కానీ అతడిని విడిచిపెట్టని బొమ్మాళీ ఆమె. భార్యాభర్తల నడుమ ఎన్ని ఉన్నా చివరికి కలిసి ఉండాలి అంటే లవ్ అండ్ లస్ట్ ముఖ్యం. ఆ రెండిటి విషయంలో ఇద్దరికీ కుదిరిందని అభిమానులు ముచ్చటించుకుంటున్నారు. ఇంతకీ ఈ స్టోరి ఎవరిదో తెలుసా? బాలీవుడ్ హాస్యనటుడు గోవిందా, ఆయన భార్య సునీతా అహూజా జంటకు సంబంధించిన కథే ఇది.