సునీత విలియమ్స్ బయోపిక్ స్క్రిప్ట్ రెడీ
బాలీవుడ్ కోలీవుడ్ మాత్రమే కాదు.. హాలీవుడ్ కూడా సునీతా విలియమ్స్ బయోపిక్‌పై ఆసక్తి చూపుతోంది. ఆమె జీవితం సాహసాలతో కూడుకున్నది.. ప్రయోగాత్మకమైనది.
By: Tupaki Desk | 20 March 2025 4:30 AM ISTభారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ స్పేస్‌లో 9 నెలల భావోద్వేగ ప్రయాణం గురించి తెలిసిందే. ఇప్పుడు భూమ్మీదికి అడుగుపెట్టడంతో ప్రపంచవ్యాప్తంగా మీడియా హెడ్ లైన్స్ లో నిలిచారు. దాదాపు తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపిన తర్వాత ఆమె బుధవారం ఐఎస్‌టి కాలమానం ప్రకారం 2:41 ఏఎంకి స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌకలో సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆమె ఎలాంటి అవాంతరాలు లేకుండా కిందికి దిగాలని ప్రార్థనలు చేసారు. అందరి ప్రార్థనలు ఫలించి సునీత విలియమ్స్ భూమిపైకి సురక్షితంగా దిగారు. ఈ వార్త తెలియగానే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తుఫాన్ చెలరేగింది. ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానుల నుండి అభినందన సందేశాలు వెల్లువెత్తాయి.
ఈ సంబరాలు వేడుకల మధ్య సునీతా విలియమ్స్ గురించిన ఒక ఎగ్జయిటింగ్ అప్‌డేట్ సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. సునీత విలియమ్స్ అద్భుతమైన ప్రయాణం ఆధారంగా ఒక బయోపిక్‌ను రూపొందించేందుకు ప్రముఖ దర్శకుడు ఆసక్తిగా ఉన్నారని తెలిసింది. సైంటిస్ట్ కం సాహసి అయిన సునీత విలియమ్స్ స్ఫూర్తిదాయకమైన కథను వెండితెరపైకి తీసుకురావడానికి ప్రఖ్యాత నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ దర్శకులు ఆమె జీవితాన్ని ఒక సినిమాగా రూపొందించడానికి పనిచేస్తున్నట్లు సమాచారం.
బాలీవుడ్ కోలీవుడ్ మాత్రమే కాదు.. హాలీవుడ్ కూడా సునీతా విలియమ్స్ బయోపిక్‌పై ఆసక్తి చూపుతోంది. ఆమె జీవితం సాహసాలతో కూడుకున్నది.. ప్రయోగాత్మకమైనది. కఠినమైన శిక్షణ అనంతరం నాసాలో చేరడం, మొత్తం 322 రోజులు అంతరిక్షంలో చిక్కుకుపోవడం.. ఎట్టకేలకు భూమికి విజయవంతంగా తిరిగి రావడం వరకు సునీత ప్రయాణం ఒక థ్రిల్లర్ కి తక్కువేమీ కాదు. దీనికోసం అత్యంత భారీ బడ్జెట్ ని వెచ్చించాల్సి ఉంటుంది. సునీత భారతీయురాలు.. అలాగే అమెరికన్ సైంటిస్ట్ . అందువల్ల భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని ఆకర్షించే ఎలిమెంట్. ఈ బయోపిక్ భారతదేశం సహా అన్నిచోట్లా ఆదరణ దక్కించుకుంటుందని అంచనా.