Begin typing your search above and press return to search.

సుమ మాదిరిగా సునీత ఎందుకు రాలేదు...?

సునీత మీడియా ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకటి రెండు కార్యక్రమాల్లో మినహా సునీత ఎక్కువగా సర్కారు నౌక్రీ సినిమా గురించి మాట్లాడిన దాఖలాలు లేవు.

By:  Tupaki Desk   |   30 Dec 2023 5:11 AM GMT
సుమ మాదిరిగా సునీత ఎందుకు రాలేదు...?
X

టాలీవుడ్‌ లో కొత్త వారసులు ఎంట్రీ ఇచ్చారు. యాంకర్ సుమ తనయుడు రోషన్‌ కనకాల మరియు ప్రముఖ సింగర్‌ సునీత తనయుడు ఆకాష్ గోపరాజు తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే రోషన్ బబుల్‌ గమ్‌ సినిమా విడుదల అయ్యింది. ఇక సునీత తనయుడు ఆకాష్ సర్కారు నౌక్రి సినిమాతో రాబోతున్నాడు.

రోషన్ ను యాంకర్‌ సుమ ఏ స్థాయిలో ప్రమోట్‌ చేసిందో మనం చూస్తూనే ఉన్నాం. గత రెండు మూడు నెలలుగా బబుల్ గమ్‌ సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్‌ చేశారు. బిగ్ బాస్‌ మొదలుకుని చాలా షో ల్లో సుమ స్వయంగా హాజరు అయ్యి తన కొడుకును పరిచయం చేసింది. దాంతో బబుల్‌ గమ్‌ కి మంచి పబ్లిసిటీ దక్కింది.

సుమ స్థాయిలో తన కొడుకు సినిమా ప్రమోషన్ కోసం సునీత మీడియా ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకటి రెండు కార్యక్రమాల్లో మినహా సునీత ఎక్కువగా సర్కారు నౌక్రీ సినిమా గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇలా ఎందుకు జరిగింది అంటూ స్వయంగా మీడియా వారు ఆకాష్ ను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు.

సర్కారు నౌక్రి సినిమాలో ఒక ప్రభుత్వ ఉద్యోగి కండోమ్స్ ను ప్రచారం చేస్తూ ఉంటాడు. కండోమ్స్ వినియోగం గురించిన కాన్సెప్ట్‌ తో సినిమా రూపొందింది. ఇది ఒక కమర్షియల్‌ సినిమా కాదు. ఎంతగా ప్రచారం చేసినా కూడా కాన్సెప్ట్‌ ప్రేక్షకుల్లోకి వెళ్తేనే ప్రచారం దక్కుతుంది. కనుక మేము ఎక్కువగా ఈ సినిమాను ప్రచారం చేయలేదని హీరో ఆకాష్ పేర్కొన్నాడు.

జనవరి 1న విడుదల అవ్వబోతున్న సర్కారు నౌక్రి సినిమా పై ఆకాష్‌ చాలా నమ్మకంగా ఉన్నాడు. మొదటి సినిమాతోనే కండోమ్స్‌ ఉపయోగాలు అనే కాన్సెప్ట్‌ ను తీసుకోవడం అనేది కచ్చితంగా సాహసం అని చెప్పాలి. ఇలాంటి ఒక సినిమా చేస్తున్నందుకు ఆయన్ను నెటిజన్స్ అభినందిస్తున్నారు.

సునీత ప్రచారం చేయకున్నా కూడా సినిమా కాన్సెప్ట్‌ జనాలను ప్రేక్షకుల్లోకి వెళ్తే తప్పకుండా మంచి పబ్లిసిటీ దక్కడంతో పాటు సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంతో యూనిట్ సభ్యులు ఉన్నారు. ఆకాష్ తదుపరి సినిమాలకు సునీతను ప్రచార కార్యక్రమాల్లో యాక్టివ్‌ గా చూసే అవకాశాలు ఉన్నాయి.