Begin typing your search above and press return to search.

గాయ‌ని సునీత జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివే!

జీవితంతో పోరాటం చేసి గొప్ప గాయ‌నిగా మార‌డం వెనుక ఆమెలో క‌సి ప‌ట్టుద‌ల నేటి త‌రం యువ‌త‌కి ఆద‌ర్శం అనొచ్చు

By:  Tupaki Desk   |   9 Jan 2024 12:18 PM GMT
గాయ‌ని సునీత జీవితంలో అద్భుత‌మైన క్ష‌ణాలివే!
X

ఫేమ‌స్ గాయ‌ని సునీత గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఎన్నో పాట‌ల‌తో త‌న‌దైన గాత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానం సంపాదించారు. న‌వ‌త‌రం గాయ‌కుల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. ఇక ఆమె వ్య‌క్తిగ‌త జీవితంలో ఎదుర్కోన్న స‌వాళ్ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ముఖ్యంగా వైవాహిక జీవితానికి సంబంధించి ఆమె ఎన్ని ఇబ్బందులు ప‌డ్డారో చాలా సంద‌ర్భాల్లో రివీల్ చేసారు.

జీవితంతో పోరాటం చేసి గొప్ప గాయ‌నిగా మార‌డం వెనుక ఆమెలో క‌సి ప‌ట్టుద‌ల నేటి త‌రం యువ‌త‌కి ఆద‌ర్శం అనొచ్చు. ఓవైపు ఇద్ద‌రు పిల్ల‌ల్ని చూసుకుంటూనే మ‌రోవైపు వృత్తిప‌రంగానూ ఎంతో ముందుకె ళ్లారు. అటుపై కొన్నాళ్ల‌కు వ్యాపార వేత్త రామ్ వీర‌ప‌నేని తో మ‌రో వివాహం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. రెండో పెళ్లి అనంత‌రం తాజాగా మూడ‌వ వివాహ వార్షికోత్సం నేడు సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు.

ఈ విష‌యాన్ని సునీత స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసారు. 'నా జీవితం మొత్తంలో అద్భుత‌మైన క్ష‌ణం ఇదేనంటూ రాసుకొచ్చారు. దీంతో సునీత అభిమానుల‌కు ఆమెకు వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ జేసారు. ఇలాంటి పెళ్లి వార్షికోత్స‌వాలు మ‌రిన్ని జరుపుకోవాల‌ని...జీవితంలో ఇంకా గొప్ప సింగ‌ర్ గా ఎద‌గాల ని కోరుకుంటున్నారు. వార్షికోత్స‌వం సంద‌ర్భంగా సునీత్ ఓ ఫోటో కూడా పోస్ట్ చేసారు.

ఆమె పెళ్లి కుమార్తెగా ముస్తాబై పెళ్లి పీఠ‌ల‌పై కూర్చుని ఉన్న ఫోటోని షేర్ చేసారు. ఎదురుగా తాళిని చూసి ఎంతో సంతోషంతో మ‌న‌సు పుల‌కించి న‌వ్వుతున్నారు. ఆమ‌ధ‌రు క్ష‌ణాల్ని గుర్తు చేసుకుంటూ ఈ ఫోటోని షేర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక సునీత కుమారుడు ఆకాష్ ఇటీవ‌లే హీరోగా లాంచ్ అయిన సంగ‌తి తెలిసిం దే. 'సర్కారు నౌక‌రి' అనే సినిమాతో తెరంగేట్రం చేసాడు.