ఆ చెత్త కామెంట్స్ కు సింగర్ సునీత రెస్పాన్స్ ఇదే..!
మొదటి వివాహంలో కొన్ని ఇబ్బందులు ఎదురు కాగా డైవర్స్ తీసుకున్న సునీత రెండేళ్ల క్రితం మ్యాంగో మీడియా గ్రూప్ ఓనర్ రామ్ వీరపనేని ని పెళ్లాడారు.
By: Tupaki Desk | 18 Nov 2023 12:28 PM GMTసింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత అందరికి సుపరిచితురాలే. సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆ ఆమె 28 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నారు. 15 ఏళ్ల వయసులోనే గాయనిగా పరిశ్రమకు పరిచయమైన సునీత తన పాటలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. గులాబీ సినిమాలో ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు అనే పాటతో మొదలైన ఆమె కెరీర్ సూపర్ హిట్ గా సాగింది. మొదటి వివాహంలో కొన్ని ఇబ్బందులు ఎదురు కాగా డైవర్స్ తీసుకున్న సునీత రెండేళ్ల క్రితం మ్యాంగో మీడియా గ్రూప్ ఓనర్ రామ్ వీరపనేని ని పెళ్లాడారు.
28 ఏళ్ల సక్సెస్ ఫుల్ కెరీర్ పూర్తి చేసుకున్న సునీత రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఈమధ్య కాలం లో ఈ నరేషన్ ప్రేమ, పెళ్లి విషయాల మీద ఆమె అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రేమ, పెళ్లి విషయాల్లో ఎమధ్య బ్రేకప్ లు ఎక్కువ అవుతున్నాయని.. లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేయడంలో వెనకపడుతున్నారని అన్నారు సునీత. శారీరకంగా మానసికంగా ఇబ్బందులు ఉంటే తప్ప చిన్న చిన్న విషయాల్లో కూడా బ్రేకప్ చెప్పుకుంటున్నారని అన్నారు. లవ్ బ్రేకప్ కి ఒక పార్టీ.. కొత్త లవర్ దొరికితే మరో పార్టీ రిలేషన్ షిప్ లో సీరియస్ నెస్ లేకుండా పోయింది.
సోషల్ మీడియాలో కూడా ఆడపిల్లల్ని చెత్త మాటలు మాట్లాడుతున్నారని వారిని ట్రీట్ చేసే విధానం కూడా బాధ కలిగిస్తుందని అన్నారు. రోజు కొన్ని వందల చెత్త కామెంట్స్ లో ఒకే ఒక్క పాజిటివ్ కామెంట్ తాను చదువుతానని.. అది ఆ చెత్త అంతటిని మర్చిపోయేలా చేస్తుందని అన్నారు.
డ్రెస్సింగ్ విషయం గురించి కూడా ఆమె మాట్లాడారు. డ్రెస్సింగ్ ని బట్టి అవతల వ్యక్తి మంచి వారా..? చెడ్డవారా..? అన్నది జడ్జ్ చేయలేమని అన్నారు సునీత. చెడ్డ అలవాట్లు ఉన్నంత మాత్రాన మనిషి చెడ్డ వారని చెప్పలేమని అన్నారు. చీరలో ఒద్దికగా ఉండే లక్షణాలు ఉంటాయని చీర కట్టుకోవడం మనదేశ సంప్రదాయం అన్నారు.
ఇక తన విషయంలో కూడా కొన్ని కామెంట్స్ తనని బాధపెట్టాయని అన్నారు. తనది ఫేక్ స్మైల్ అని అన్నారు. మాట్లాడుతున్నప్పుడు హస్కీగా ఉంటుంది.. మాటలు మింగేస్తుందని.. ఎప్పుడు ఏడుస్తుందని విమర్శలు చేసిన వాళ్లు ఉన్నారని అన్నారు సునీత. ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా వాటిని తాను పట్టించుకోలేదని అందుకే కెరీర్ ఎప్పుడూ బ్రేక్ పడలేదని అన్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా రికార్డింగ్ స్టూడియోలోకి వెళ్తే అన్నిటినీ మర్చిపోయి తన వృత్తి మాత్రమే గుర్తుండేదని అన్నారు.