Begin typing your search above and press return to search.

'జాట్' సన్నీ బర్త్ డే సెలబ్రేషన్స్.. మనోళ్లు భారీగానే..

ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించి మంచి యాక్షన్ హీరోగా క్రేజ్ దక్కించుకున్నారు.

By:  Tupaki Desk   |   21 Oct 2024 10:00 AM GMT
జాట్ సన్నీ బర్త్ డే సెలబ్రేషన్స్.. మనోళ్లు భారీగానే..
X

బాలీవుడ్ సీనియర్‌ నటుడు ధర్మేంద్ర వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సన్నీ డియోల్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. తన నటనతో వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించి మంచి యాక్షన్ హీరోగా క్రేజ్ దక్కించుకున్నారు. పాప్‌ కీ ధూనియా, రామ్‌- అవతార్‌, ఘయల్, దామిని, డర్‌, జీత్, బోర్డర్‌, గదర్‌ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. సినీ ప్రియులను ఓ రేంజ్ లో అలరించారు.

గతేడాది గదర్‌ 2తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు సన్నీ. ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో జాట్ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హీరోయిన్లుగా రెజీనా, సయామీ ఖేర్‌ నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా జాట్ ను మైత్రీ మూవీస్‌ మేకర్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా గ్రాండ్ గా నిర్మిస్తున్నాయి. రీసెంట్ గా సన్నీ డియోల్ బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

అందులో ఓ యాక్షన్ సీక్వెన్స్ లో పెద్ద ఫ్యాన్ ను చేతిలో పట్టుకుని అగ్రెసివ్ గా సన్నీ డియోల్ కనిపించారు. అయితే బర్త్ డే సందర్భంగా అనేక మంది టాలీవుడ్ సెలబ్రిటీలు, సినీ ప్రియులు సన్నీకి విషెస్ చెప్పారు. అదే సమయంలో జాట్ మేకర్స్ కూడా సన్నీ బర్త్ డే సెలబ్రేషన్స్ ను హైదరాబాద్‍‌ లోని ఓ షూటింగ్ స్పాట్‌ లో నిర్వహించారు. ఆ సందర్భంగా సన్నీ చేత భారీ కేక్‌ ను కట్‌ చేయించారు. అందుకు సంబంధించిన వీడియోను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రీసెంట్ గా షేర్ చేసింది.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ వీడియోలో వైరల్ గా మారగా.. వేడుకలు భారీగానే నిర్వహించినట్లు తెలుస్తోంది. జాట్ మూవీ యూనిట్ అంతా వేడుకల్లో పాల్గొంది. సన్నీతో వర్క్‌ చేసిన పలువురు దర్శకులు, సింగిల్‌ స్క్రీన్‌ ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేతలు కూడా అటెండ్ అయ్యారు. కేక్ కట్ చేశాక వేడుకలకు వచ్చిన వారంతా ఆయనకు తినిపించారు. అంతా నవ్వుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు వీడియో చూస్తే తెలుస్తోంది.

టాలీవుడ్ లో ఉన్న అనేక మంది ఫ్యాన్స్ కూడా.. వేడుకల సందర్భంగా సన్నీ డియోల్ ను కలిసే అవకాశాన్ని కల్పించారు జాట్ మేకర్స్. స్టేజ్ మీదకు వరుసగా వెళ్లి ఆయనకు ఫ్యాన్స్ విషెస్ చెప్పారు. అనేక మంది స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. దీంతో సన్నీ డియోల్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినట్లు కనిపిస్తోంది. మొత్తానికి జాట్ మేకర్స్.. సన్నీకి మెమొరబుల్ మూమెంట్స్ అందించారన్నమాట. మరి జాట్ మూవీతో ఆయన ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.