ఆయనొచ్చినా హనుమంతుడు ఇంకా సస్పెన్స్!
తాజాగా సన్ని డియోల్ కూడా ప్రాజెక్ట్ లోకి అధికారికంగా ఎంటర్ అయ్యారు. సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
By: Tupaki Desk | 11 Dec 2024 4:30 PM GMTబాలీవుడ్ దర్శకుడు నితిష్ తివారీ ఇతిహాసం రామాయణం ఆధారంగా `రామాయణ్` ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రాముడి పాత్రలో రణబీర్ కపూర్.. సీత పాత్రలో సాయి పల్లవి...రావణుడి పాత్రలో యశ్ లాంటి స్టార్లతో భారీ కాన్సాస్ పై తెరకెక్కిస్తున్నారు. కుంభకర్ణుడి పాత్రలో బాబి డియోల్ని, ..హనుమంతుడి పాత్రలో సన్నిడియోల్ ఎంపిక చేసినట్లు ప్రచారంలో ఉంది. ఇంకా రామాయణంలో ఉన్న కీలక పాత్రలకు చాలా మంది ప్రముఖల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా సన్ని డియోల్ కూడా ప్రాజెక్ట్ లోకి అధికారికంగా ఎంటర్ అయ్యారు. సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. `హాలీవుడ్ చిత్రమైన `అవతార్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్` లాంటి సుదీర్ఘమైన ప్రాజెక్ట్ ఇది. అద్భుత మైన విజువల్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతన్న చిత్రంలో నేను కూడా భాగమయ్యాను. కానీ ఇందులో నేను ఏ పాత్ర పోషిస్తున్నాను? అన్నది అప్పుడే చెప్పాలనుకోవడం లేదు` అంటూ పాత్ర విషయంలో గోప్యత వహించారు.
ఇప్పటికే హనుమంతుడి పాత్ర అయనకు ఫిక్సై అయినట్లు కొన్ని నెలలుగా నెట్టింట ప్రచారం పెద్ద ఎత్తున జరు గుతోంది. సినిమాలో ఆ పాత్ర ఎంతో కీలకమైనది. రాముడు కథలో హనుమంతుడు ఎంతో కీలకమైన పాత్ర కావడం సహా...శక్తివంతమైన పాత్ర కావడంతో ఎవర్ని తీసుకుంటారు? అన్న సస్పెన్స్ కు తెర పడుతుంది అనుకుంటే మళ్లీ సన్ని డియోల్ ఇలా ట్విస్ట్ పెట్టారు.
ప్రస్తుతం సన్ని డియోల్ వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. `గదర్2` విజయంతో ఒక్కసారిగా బిజీ అయ్యాడు. తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ కి వెళ్లి మరీ సన్ని డియోల్ తో `జాట్` అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో పాటు `బోర్డర్ -2`, `లాహోర్ 1947` చిత్రాల్లో నటిస్తున్నారు.