'జాట్' విలన్.. టీజర్ కంటే పోస్టరే అతి క్రూరంగా...
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై హైప్ పెంచగా, తాజాగా రణ్‌దీప్ హుడా లుక్ మాత్రం అందరికీ షాక్ ఇచ్చేలా ఉంది.
By: Tupaki Desk | 10 March 2025 12:35 PM ISTబాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్, టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న పవర్‌ఫుల్ యాక్షన్ మూవీ జాట్ భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. కచ్చితమైన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకు ఎస్. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై హైప్ పెంచగా, తాజాగా రణ్‌దీప్ హుడా లుక్ మాత్రం అందరికీ షాక్ ఇచ్చేలా ఉంది.

అతని ఇంట్రో టీజర్ కంటే కూడా పోస్టర్ అతి క్రూరంగా ఉండడం వైరల్ అవుతోంది. బాలీవుడ్ విలక్షణ నటుడు రణ్‌దీప్ హుడా ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్ కంటే కూడా ఇది కీలక పాత్ర అని మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. అయితే ఆయన పాత్ర సాధారణంగా ఉండదని, ఫుల్ లెంగ్త్ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో అదిరిపోయేలా కనిపిస్తారని చెప్పేలా తాజా అప్డేట్ వదిలారు. మాస్ ఇంటెన్సిటీతో నిండిన ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరీ ముఖ్యంగా పోస్టర్‌లో రణ్‌దీప్ హుడా బీడీ తాగుతూ, అతని చేతిలో ఓ మొండెం ఉండేలా చూపించడం సినిమాపై మరింత మిస్టరీ పెంచుతోంది. పోస్టర్ చూస్తుంటే.. రణ్‌దీప్ హుడా పాత్ర పూర్తిగా క్రూరంగా, ఇంటెన్స్ టోన్‌లో ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఒంటిమీద షర్ట్ లేకుండా కేవలం లుంగీలో ఓ పెద్ద కుర్చీలో హుందాగా కూర్చొని ఉన్న లుక్ చూస్తేనే ఎంత భయానకమైన పాత్రలో ఉన్నాడో అర్థమవుతోంది.
అతని చేతిలో ఉన్న మొండెం, పోస్టర్ టోన్ మాత్రం సినిమాలో హారర్ యాక్షన్ మిక్స్ కాన్సెప్ట్ ఉందేమో అనే అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. మేకర్స్ కూడా “జాట్ ప్రపంచం నుండి భయంకరమైన రణతుంగగా రణ్‌దీప్ హుడాను పరిచయం చేస్తున్నాము” అంటూ ఈ లుక్‌కి మరింత ఆసక్తిని పెంచారు. ఇప్పటికే వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో రణ్‌దీప్ హుడా పాత్ర మరింత ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది.
గోపీచంద్ మలినేని గత చిత్రాల కంటే ఇది పూర్తి స్థాయి డిఫరెంట్ మాస్ యాక్షన్ సినిమాగా రూపొందుతోందని టాక్. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయనీ, మిగతా క్యారెక్టర్స్ గ్లింప్స్ కూడా త్వరలో వదులుతామని మేకర్స్ హింట్ ఇచ్చారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బాలీవుడ్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తోంది. సన్నీ డియోల్ రీ ఎంట్రీ మూవీగా ఉండబోతున్న జాట్, యాక్షన్ మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకునేలా ఉండబోతుందని ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ ఆధారంగా అర్థమవుతోంది.