జాట్ సర్ ప్రైజ్ కోసం ఇస్మార్ట్ పాప
బాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన యాక్షన్ మూవీ ‘జాట్’ లో ఒక్కొక్కటిగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బైటకు వస్తున్నాయి.
By: Tupaki Desk | 24 March 2025 6:00 PM ISTబాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన యాక్షన్ మూవీ ‘జాట్’ లో ఒక్కొక్కటిగా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బైటకు వస్తున్నాయి. సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఇప్పటికే భారీ క్రేజ్ ఏర్పడింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు థమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో క్రేజీ విలన్‌గా రణ్‌దీప్ హుడా లుక్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు, ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ట్రేండింగ్ లో నిలిచింది. సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా, వినీత్ కుమార్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. బాక్సాఫీస్ వద్ద సన్నీ డియోల్ కి ఇది ఓ మాస్ రీ ఎంట్రీ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక తాజా అప్‌డేట్ ప్రకారం టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఈ సినిమాలో ఓ స్పెషల్ ఐటెమ్ సాంగ్‌లో నటించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు చిత్ర బృందం ఒక స్పెషల్ మాస్ నెంబర్ రూపొందించిందట. బాలీవుడ్ స్టార్ హీరో మూవీగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నభా కనిపించడం ఆమె కెరీర్‌కి కొత్త దిశగా మారవచ్చునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇస్మార్ట్ శంకర్ అనంతరం ఆమెకు సరైన సక్సెస్ రాలేదు. దీంతో ఈ స్పెషల్ సాంగ్ ద్వారా అటు బాలీవుడ్‌లో, ఇటు సౌత్‌లో తిరిగి ఫోకస్ లోకి వచ్చేందుకు ఇది బెస్ట్ ఛాన్స్ కావొచ్చని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా తర్వాత ఒకసారి రోడ్డు ప్రమాదానికి గురై సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న నభా, ఇటీవలే ‘డార్లింగ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
దీంతో మరోసారి గ్లామర్‌కు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలవైపు ఆమె ఫోకస్ పెంచింది. ఇప్పుడు జాట్ మూవీ ఐటెమ్ సాంగ్‌తో వచ్చిన ఈ అవకాశాన్ని నభా ఎంతవరకు వినియోగించుకుంటుందనేదే ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాను ఏప్రిల్ 10న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. మాస్ యాక్షన్, హారర్ థ్రిల్ మిక్స్‌తో వస్తున్న ఈ సినిమాలో అన్ని కమర్షియల్ అంశాలూ బలంగా ఉన్నట్లు ఇప్పటికే విడుదలైన కంటెంట్ ఆధారంగా తెలుస్తోంది. నభా నటేష్ స్పెషల్ సాంగ్ కూడా సినిమాకి హైలైట్ అవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఈ పాటతో నభాకు మళ్లీ క్రేజ్ వస్తుందా.. లేదంటే మరో గ్లామర్ గెస్ట్ గా మిగిలిపోతుందా అన్నది రిజల్ట్ తర్వాత తేలనుంది.