8 కోట్లతో భారీ ఆఫీస్ స్పేస్ కొనుగోలు చేసిన సన్నీలియోన్
తనదైన అందం, నట ప్రతిభ, వేడెక్కించే నృత్య భంగిమలతో సన్నీలియోన్ బాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు తన హవా కొనసాగించింది.
By: Tupaki Desk | 7 Feb 2025 8:38 AM GMTతనదైన అందం, నట ప్రతిభ, వేడెక్కించే నృత్య భంగిమలతో సన్నీలియోన్ బాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు తన హవా కొనసాగించింది. దీపం ఉండగానే అన్న చందంగా.. క్రేజ్ ఉన్నప్పుడే సొంత వ్యాపారాల్లోకి ప్రవేశించి అక్కడ భారీ పెట్టుబడులను పెట్టింది. ప్రస్తుతం సన్నీలియోన్ `స్టార్ స్టక్` కంపెనీలు దినదినప్రవర్థమానంగా ఎదుగుతోంది.
సన్నీలియోన్ కంపెనీ స్టార్ స్టక్ - సౌందర్య ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో భారీగా లాభాల్ని అందుకుంటోంది సన్నీ. అయితే అంతకంతకు విస్తరిస్తున్న తన వ్యాపార వాణిజ్య కార్యకలాపాల కోసం విశాలమైన ఆఫీస్ స్థలం అవసరం పడింది. దీంతో సన్నీలియోన్ ఏకంగా 8 కోట్ల పెట్టుబడితో ముంబైలోని ఓషివారా ప్రాంతంలో ఆఫీస్ స్థలాన్ని కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ కార్యాలయం వీర్ గ్రూప్ వాణిజ్య ప్రాజెక్ట్ అయిన వీర్ సిగ్నేచర్‌లో ఉంది. ఈ ప్రాపర్టీలో మూడు కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఆనంద్ కమల్‌నాయన్ పండిట్, రూప ఆనంద్ పండిట్ యాజమాన్యంలోని ఐశ్వర్య ప్రాపర్టీ అండ్ ఎస్టేట్స్ నుండి ఆమె దానిని కొనుగోలు చేసింది. పండిట్ లు బాలీవుడ్ లో సినీనిర్మాతలుగాను ప్రసిద్ధి చెందారు.
స్క్వేర్ యార్డ్స్ పత్రాల ప్రకారం.... కరెన్‌జిత్ కౌర్ వెబర్ అలియాస్ సన్నీ లియోన్ ముంబైలోని ఓషివారాలో రూ.8 కోట్లకు ఆఫీస్ స్థలాన్ని కొనుగోలు చేసిందని కన్ఫామ్ అయింది. లోఖండ్‌వాలా కాంప్లెక్స్ సమీపంలో ఇది ఉంది. ఓషివారా ప్రధాన రోడ్లు, ముంబై మెట్రోతో బాగా అనుసంధానమై ఉన్నందున అత్యధిక డిమాండ్ ఉన్న స్థలం ఇది.
సన్నీ కొనుగోలు చేసిన కార్యాలయ స్థలం 176.98 చ. మీల(సుమారు 1,904.91 చ.అడుగులు) కార్పెట్ ఏరియా,194.67 చదరపు మీ.ల(సుమారు 2,095 చ. అడుగులు) ఇన్ బిల్ట్ స్పేస్‌ని కలిగి ఉంది. ఆస్తిలో మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఈ లావాదేవీలో రూ. 35.01 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లింపు, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉన్నాయి.
స్క్వేర్ యార్డ్స్ వివరాల ప్రకారం.. అమితాబ్ బచ్చన్, అజయ్ దేవ్‌గన్, కార్తీక్ ఆర్యన్ , సారా అలీ ఖాన్ వంటి బాలీవుడ్ తారలు కూడా వీర్ సిగ్నేచర్‌లో ఆస్తులను కొనుగోలు చేసారు. నటి, వ్యవస్థాపకురాలు, మోడల్ అయిన సన్నీ లియోన్ తన సంపదల్ని రియల్ వెంచర్లలోను పెడుతోంది. జిస్మ్ 2, రాగిణి ఎంఎంఎస్ 2, ఏక్ పహేలి లీలా వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో సన్నీలియోన్ సత్తా చాటింది. 2018లో తన కాస్మెటిక్ బ్రాండ్ స్టార్‌స్ట్రక్ బై సన్నీ లియోన్‌ను ప్రారంభించింది.