సన్నీలియోన్: ఇంతందం వెనక అంత ఘాటు స్టోరి
నేడు బాలీవుడ్ తారలకు ధీటుగా అడల్ట్ ఇండస్ట్రీ నుంచి వచ్చి స్థిరపడిన మేటి ప్రతిభావంతురాలిగా నిరూపించుకుంది.
By: Tupaki Desk | 15 Nov 2024 10:30 PM GMTటాప్ మోడల్ కం శృంగార నాయిక సన్నీలియోన్ లైఫ్ జర్నీ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. కానీ సన్నీలియోన్ జీవితంలో ఒకానొక దశలో నిరాశ, నిస్పృహలు, విజయాలు, అపజయాలు, చివరికి స్థిరమైన జీవితం కోసం పోరాటం ఇవన్నీ ఆశ్చర్యపరుస్తాయి. నేడు బాలీవుడ్ తారలకు ధీటుగా అడల్ట్ ఇండస్ట్రీ నుంచి వచ్చి స్థిరపడిన మేటి ప్రతిభావంతురాలిగా నిరూపించుకుంది. నటిగా, మోడల్ గా, ఎంటర్ ప్రెన్యూర్‌గా ఎదిగింది.
సన్నీలియోన్ గతంలోకి వెళితే ఈ కథ ప్రతిసారీ కొత్తగా వింతగా అనిపించక మానదు. సన్నీలియోన్ భారతీయ సంతతికి చెందిన సినీనటి. తండ్రి టిబెట్ లో పుట్టిన సిక్కు మతస్తుడైనా ఆయన ఢిల్లీలో పెరిగాడు. ఈమె తల్లి హిమాచల్ ప్రదేశ్ వాస్తవ్యురాలు. 1981 మే 13 న జన్మించిన ఈమె అసలు పేరు కరేన్ మల్హోత్రా. ఈమె పుట్టక ముందే తల్లిదండ్రులు కెనడా దేశంలో స్థిరపడ్డారు. సన్నీలియోన్ చిన్నతనంలో పాటలు పాడటం, డాన్స్ చేయడం, హార్స్ రైడింగ్, కుక్క పిల్లలని ఇష్ట పడేది. చిన్నతనం నుండి సన్నీలియోన్ స్వేచ్ఛగానే పెరిగింది. పదకొండు ఏళ్ల వయసులో తన బాయ్ ఫ్రెండ్ తొలి ముద్దును రుచిచూసింది. పద్నాలుగేళ్ళ వయసులో నానమ్మ ఒత్తిడి మేరకు కుమార్తెను తీసుకొని తల్లిదండ్రులు కాలిఫోర్నియాకు వెళ్ళారు. పదహారేళ్ళ వయసులో తన బాయ్ ఫ్రెండ్ కు కన్యత్వాన్ని అర్పించిన సన్నీలియోన్ పద్దెనిమిదేళ్ళ వయసులో తాను బై సెక్సువల్ అని గుర్తించింది.
కెనడా టు అమెరికా సన్నీలియోన్ ప్రయాణం ఆసక్తికరమైనది. యుక్తవయసుకు వచ్చిన సన్నీలియోన్ మోడల్ గా ఎదగాలనుకుంది. 1999 లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీడియాట్రిక్ నర్సుగా శిక్షణ తీసుకుంది. ఈ దశలో వివస్త్రణ అవుతూ నాట్యం చేసే మరో యువతి పరిచయమైంది. తన ద్వార్ జాన్ స్టెవెన్స్ అనే ఏజెంట్ పరిచయమయ్యాడు. అతని ద్వారా అడల్ట్ పత్రిక అయిన పెంట్ హౌస్ లో పనిచేసే `జె అలెన్` ను ముఖాముఖి కలిసిన తర్వాత అడల్ట్ ఇండస్ట్రీ పై అపోహలు తొలగిపోయాయి. క్రమేణా అడల్ట్ ప్రపంచానికి చేరువైంది. హై సొసైటి, స్వాంక్, లెగ్ వరల్డ్, హస్లర్, క్లబ ఇంటర్నేషనల్ వంటి అడల్ట్ పత్రికల్లో పూర్తి నగ్నంగా ఫోజులిచ్చింది. 2003 సంవత్సరానికి `పెంట్ హౌస్ పెట్ ఆఫ్ ది ఇయర్` అవార్డును గెల్చుకొంది.
2005 లో నీలి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి నటిగా ఎ.వి.యన్ అలల్ట్ ఇండస్ట్రీ అవార్డు సాధించింది. తర్వాత స్వయంగా ప్రొడక్షన్ కంపెనీ ప్రారంభించింది. తర్వాత అడల్ట్ పరిశ్రమను వదులుకునేందుకు ప్రయత్నించింది. 2011 లో జరిగిన బిగ్ బాస్ 5 వంటి రియాలిటీ షోలో పాల్గొన్న సన్నీలియోన్ బాలీవుడ్ నటిగా అవకాశం అందుకుంది. జిస్మ్ 2 ఈమె మొదటి హీందీ చిత్రం.
సన్నీ లియోన్ నీలి చిత్రాలకు స్వస్తి చెప్పి బాలీవుడ్ సినిమా దర్శకురాలు, నిర్మాత అయిన పూజాభట్ నిర్మించిన జిస్మ్ 2 లో ప్రధాన ప్రాత పోషించింది. రాగిణి MMS 2 అనే మరో బాలీవుడ్ చిత్రంలో నటించింది. మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంట్ తీగ అనే తెలుగు చిత్రంలో కూడా నటించింది. ఏక్ పహేలీ లీల, కుచ్ కుచ్ లోచా హై సహా పలు చిత్రాల్లో నటించింది. కండోం ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసడర్ గాను కనిపించిన సన్నీ శృంగార రస చిత్రాల నాయికగాను బాలీవుడ్ లో కనిపించింది. ఆరంభం అవమానాలను ఎదుర్కొన్న కాలక్రమేణా తన సత్తా చాటి అందరినీ పక్కకు నెట్టగలిగింది. ఇప్పుడు సన్నీ సుస్థిరమైన సంసార జీవనంలో కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సన్నీ లియోన్ కు మిలియన్లలో అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియాలలో తనను అనుసరించేవారి సంఖ్య అసంఖ్యాకంగా ఉంది. ఇక డేనియల్ వెబర్ ని పెళ్లాడి సరోగసి కిడ్స్ ని పెంచుకుంటోంది. భర్త, పిల్లలతో సన్నీలియోన్ హ్యాపీ లైఫ్ గురించి తెలిసినదే.