హిట్టొచ్చినా ఈ అప్పులు తీరేదెలా డియోల్?
రూ. 56 కోట్ల అప్పుల రికవరీపై గదర్ 2 నటుడు సన్నీ డియోల్ జుహు బంగ్లాను అమ్మకానికి పెట్టిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పుడు నోటీసును ఉపసంహరించుకుంది.
By: Tupaki Desk | 21 Aug 2023 4:15 AM GMTరూ. 56 కోట్ల అప్పుల రికవరీపై గదర్ 2 నటుడు సన్నీ డియోల్ జుహు బంగ్లాను అమ్మకానికి పెట్టిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పుడు నోటీసును ఉపసంహరించుకుంది. రుణదాత జారీ చేసిన కారిజెండమ్‌లో సాంకేతిక కారణాల కారణంగా ఇ-వేలం నోటీసును ఉపసంహరించుకున్నట్లు పేర్కొంది.
56 కోట్ల రుణాన్ని చెల్లించడంలో విఫలమైనందున సన్నీకి ఈ పరిస్థితి ఎదురైంది. తొలి ప్రకటన ప్రకారం సెప్టెంబర్ 25న బంగ్లా వేలం వేయాల్సి ఉండగా.. రిజర్వ్ ధర రూ.51.43 కోట్లుగా ఉంచారు. అయితే సోమవారం ఒక కొరిజెండమ్‌లో బ్యాంక్ అసలు విషయం తెలిపింది. "మిస్టర్ అజయ్ (సన్నీడియోల్ అసలు పేరు)కి సంబంధించి సేల్ నోటీసుకు సంబంధించి 20.08.2023 నాటి టైమ్స్ ఆఫ్ ఇండియా ముంబై ఎడిషన్ (Pg.3)లో ప్రచురించబడిన 19.08.2023 తేదీ నాటి E వేలం అమ్మకానికి సంబంధించిన నోటీసు జుహు తాలూకా అంధేరి ముంబై సబర్బన్ జిల్లా, గ్రామంలోని సర్వే నెం. 41 హిస్సా నెం 5 (Pt) CTS నెం. 173లో ఉన్న భూమి లేదా ఆస్తికి సంబంధించిన సాంకేతిక కారణాల వల్ల వేలం ఉపసంహరించబడింది. గాంధీగ్రామ్ రోడ్ జుహు ముంబై 400049 వద్ద ఉన్న సన్నీ విల్లా అని పిలువబడే నిర్మాణం క్రింద 599.44 చ.మీ. వేలం తదుపరి తేదీని వెల్లడిస్తాం.. అని ప్రకటించింది.
ఇంత అప్పు దేనికి అయింది?
2016 మూవీ 'ఘాయల్ వన్స్ అగైన్' (స్వీయనిర్మాణం దర్శకత్వంలో రూపొందింది) కోసం సన్నీ డియోల్ ఈ ఖరీదైన విల్లాను తాకట్టు పెట్టారు. అయితే ఆ సినిమా దారుణ వైఫల్యం ఈ అప్పులు మిగిల్చింది. వడ్డీలతో సకాలంలో అప్పును చెల్లించడంలో సన్నీ విఫలమయ్యాడు. దీంతో ఇప్పుడు ఈ ఆక్షన్ కి బ్యాంకు సిద్ధమైంది. ఇక ఈ వేలంలో పాడుకున్న వ్యక్తికి ఈ ఆస్తిని దఖలు పరచాలంటే కొన్నేళ్ల పాటు పట్టే అవకాశం ఉందని కూడా ఒక సెక్షన్ మీడియా విశ్లేషిస్తోంది. ఈ వేలం సమయానికి సన్నీలియోన్ గదర్ 2తో బంపర్ హిట్టు కొట్టాడు. ఈ విజయంతో అతడి కోసం సూట్ కేసులు పట్టుకుని అడ్వాన్సులు ఇచ్చేందుకు నిర్మాతలు ఎగబడుతున్నారన్న సమాచారం ఉంది. ఈ సన్నివేశంలో అతడు బ్యాంకు అప్పు తీర్చేందుకు ఆస్కారం ఉంది. ఇక సన్నీడియోల్ విల్లాలో సొంత సినిమా ఆఫీసు.. స్టూడియో నిర్వాహణ వగైరా కొనసాగుతున్నాయి. ఇప్పుడు అప్పు చెల్లించేస్తే ఈవేలం ఆపేందుకు వీలుందో లేదో కూడా వెల్లడి కావాల్సి ఉంది.
సన్నీడియోల్ నటించిన 'గదర్ 2' పదో రోజు 41 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పటికి ఈ సినిమా ఇండియాలో రూ.377.20 కోట్లు వసూలు చేసిందని అంచనా. అక్షయ్ కుమార్ -OMG 2తో పోటీగా విడుదలైనా ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. OMG 2, సీక్వెల్ కూడా రూ. 114 కోట్ల కలెక్షన్‌తో మంచి ప్రదర్శనను కనబరిచింది.