మరో 'పార్ట్ - 2' కి రెడీ అవుతున్న సీనియర్ హీరో
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ కెరీర్ ఖతం అయింది అనుకుంటున్న సమయంలో 'గదర్ 2' సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
By: Tupaki Desk | 20 Aug 2023 7:42 AM GMTబాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ కెరీర్ ఖతం అయింది అనుకుంటున్న సమయంలో ‘గదర్ 2’ సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తన సూపర్ హిట్ సినిమా గదర్ కి పార్ట్ 2 గా రూపొందిన గదర్ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ముందు ముందు పార్ట్ 2 లు మరిన్ని వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి అనిపిస్తుంది.
బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సన్నీ డియోల్ 1997 లో బోర్డర్ అనే బ్లాక్ బస్టర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అంతకు ముందు ఆ తర్వాత బాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ వార్ మూవీస్ లో 'బోర్డర్' కి ప్రత్యేక స్థానం ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సన్నీ డియోల్ ఇప్పుడు ఆ సూపర్ హిట్ మూవీ పార్ట్ 2 కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి. గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ సీక్వెల్ కోసం చర్చలు జరుగుతున్నాయి అంటూ మేకర్స్ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. సన్నీ డియోల్ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ పెంచామని మేకర్స్ చెబుతున్నారు.
బోర్డర్ 2 కి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవలే సన్నీ డియోల్ ఈ సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చాడు. మేకర్స్ కూడా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సినిమా ప్రకటన అఫిషియల్ గా ఏ క్షణంలో రావచ్చు అంటూ బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
గతంలో వచ్చిన బోర్డర్ కథ కి సీక్వెల్ అన్నట్లుగా ఉంటుందా లేదంటే కాన్సెప్ట్ ను తీసుకుని కొత్త కథతో సినిమాను చేస్తారా అనేది చూడాలి. బోర్డర్ సినిమా కు పార్ట్ 2 తీయడం అనేది సాహస నిర్ణయం అని.. గదర్ 2 మాదిరిగా బోర్డర్ 2 కూడా ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి.