'యానిమల్' తరహా కాంబో టైటిల్ 'జాట్'
దాదాపు ఏడాది పాటు జరిపిన చర్చల తర్వాత చివరకు బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తో సినిమా మొదలు పెట్టాడు.
By: Tupaki Desk | 29 Jun 2024 7:26 AM GMTనందమూరి బాలకృష్ణ తో వీరసింహా రెడ్డి సినిమాను రూపొందించి సూపర్ హిట్ ను దక్కించుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని వెంటనే మరో సినిమాను చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల చాలా ఆలస్యం అయ్యింది. దాదాపు ఏడాది పాటు జరిపిన చర్చల తర్వాత చివరకు బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తో సినిమా మొదలు పెట్టాడు.
టాలీవుడ్ హీరోతో మొదట ఈ సినిమాను చేయాలని భావించినా కూడా బడ్జెట్ విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని భావించి ఆ సినిమా క్యాన్సల్ చేశారు. గదర్ 2 సినిమా తో సూపర్ హిట్ ను దక్కించుకున్న సన్నీ డియోల్ తో తన కథ ను సినిమాగా చేయాలని దర్శకుడు గోపీచంద్ మలినేని భావించాడు.
పాన్ ఇండియా రేంజ్ లో సన్నీ డియోల్ మరియు గోపీచంద్ మలినేని కాంబో మూవీ రూపొందబోతుందట. తాజాగా ఈ సినిమాకు 'జాట్' అనే విభిన్నమైన టైటిల్ ను ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతోంది. అతి త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా టైటిల్ తో పాటు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
వయసుకు తగ్గ పాత్రలో సన్నీ డియోల్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా ను హిందీ సినిమాగా నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ అరుదైన కలయిక మూవీని ఇదే ఏడాదిలో విడుదల చేస్తారనే సమాచారం అందుతోంది.
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబోలో యానిమల్ వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ హీరో మరియు టాలీవుడ్ డైరెక్టర్ కాంబోలో రూపొందబోతున్న ఈ సినిమా యానిమల్ రేంజ్ లో హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.