సన్నీలియోన్ .. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
సన్నీలియోన్ అసలు పేరు నిజానికి కరెన్‌జిత్ కౌర్ వోహ్రా
By: Tupaki Desk | 21 July 2023 3:49 AM GMTశృంగార పరిశ్రమ నాయకిగా దశాబ్ధం పైగా కెరీర్ ని కొనసాగించిన సన్నీలియోన్ అసలు పేరు నిజానికి కరెన్‌జిత్ కౌర్ వోహ్రా. కెనడాలో నివసిస్తున్న భారతీయ సిక్కు కుటుంబంలో జన్మించిన కరెన్ జిత్ అనూపహ్యంగా అడల్ట్ పరిశ్రమలోకి ప్రవేశించింది. 2000 లో శృంగార రస సినిమాల్లో నటించేందుకు ఆమె సాహసించింది.
అయితే ఈ సాహసం చేయడానికి ముందు సన్నీలియోన్ అమెరికా వెళ్లి అక్కడ రకరకాల ఉద్యోగాలు చేసానని కూడా తెలిపింది. హెచ్.ఆర్ డిపార్ట్ మెంట్ లో పని చేశానని అకౌంటింగ్ డిపార్ట్ మెంట్ లోను ఉద్యోగం చేసానని సన్నీ తెలిపింది.
టాక్స్ వసూళ్లకు సంబంధించిన శాఖలోను కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేశానని చివరికి రిసెప్షనిస్టుగా పని చేశానని కూడా వెల్లడించింది. అయితే ఎన్నో ఉద్యోగాలు చేశాక చివరికి అప్పటి పరిస్థితుల్లో అడల్ట్ పరిశ్రమలో ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించింది.
2000 నుంచి 2010 వరకూ సన్నీలియోన్ దశాబ్ధ కాలం అడల్ట్ సినీపరిశ్రమలో పని చేసింది. అక్కడ గొప్ప స్టార్ గా ఓ వెలుగు వెలిగింది. అటుపై అనూహ్యంగా భారతదేశానికి వచ్చి ఇక్కడ బుల్లితెరపై 'బిగ్ బాస్' షోలో నటించింది. దీంతో తన దశ తిరిగిపోయింది. బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే తనకు సినిమా ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ లో కెరీర్ మొదలైంది. ఆ తర్వాత సన్నీ కెరీర్ ఇతర వ్యవహారాల గురించి అంతా తెలిసిందే.
తనకు సన్నీలియోన్ అనే పేరు ఎలా వచ్చిందో కూడా సన్నీ వెల్లడించింది. తన సోదరుడి మారు పేరు సన్నీ. అడల్ట్ పరిశ్రమ ప్రవేశానికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తన ఒరిజినల్ పేరును వెల్లడించకుండా దాచిపెట్టాల్సి వచ్చింది.
దీంతో తన పేరును 'సన్నీ' అని తానే కోరుకుంది. దానికి చివరిగా 'లియోన్' ని జోడించి సన్నీలియోన్ అని నామకరణం చేసారు. సన్నీ అనే పేరును ఎంచుకోవడంతో తన తల్లి గారు తీవ్రంగా అసహ్యించుకున్నారని కూడా సన్నీ తెలిపింది. 19ఏళ్ల వయసులో అలా పేరు మార్చుకుని అడల్ట్ పరిశ్రమలోకి వెళ్లానని కూడా వెల్లడించింది.