Begin typing your search above and press return to search.

స‌న్నీలియోన్‌తో ప్ర‌భుదేవా 'పెట్టా రాప్' గిలిగింత‌లే

ఈ జంట న‌డుమ కెమిస్ట్రీ, డ్యాన్సింగ్ స్టైల్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

By:  Tupaki Desk   |   17 Sep 2024 8:30 PM GMT
స‌న్నీలియోన్‌తో ప్ర‌భుదేవా పెట్టా రాప్ గిలిగింత‌లే
X

బాలీవుడ్ సంచలనం సన్నీ లియోన్ చార్ట్ బ‌స్ట‌ర్ సింగిల్స్ తో కుర్ర‌కారు హృద‌యాల‌ను దోచుకుంది. ఇప్పుడు దిగ్గ‌జ‌ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో క‌లిసి `పెట్టా రాప్` అనే పాట‌లో త‌న‌వైన డ్యాన్సింగ్ విన్యాసాల‌ను ప్ర‌ద‌ర్శించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ పాట సెప్టెంబర్ 27న విడుదల కానుందని, అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌గా ఉంటుందని తెలుస్తోంది. తాజాగా విడుదలైన సాంగ్ టీజర్‌లో సన్నీలియోన్ తెల్లటి కటౌట్ డ్రెస్‌లో అద్భుతంగా క‌నిపించింది. ఇండియ‌న్ మైఖేల్ జాక్స‌న్ ప్రభుదేవాతో స‌న్నీలియోన్ స్టెప్పులు మ‌రో లెవ‌ల్లో ట్రీట్ గా నిలుస్తాయ‌ని, స్క్రీన్ ని మ‌రిగించ‌డం ఖాయ‌మ‌ని టాక్ వినిపిస్తోంది. ఈ జంట న‌డుమ కెమిస్ట్రీ, డ్యాన్సింగ్ స్టైల్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ పాట త్వ‌ర‌లో విడుద‌ల సంద‌ర్భంగా సన్నీలియోన్ తన ఉత్సాహాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. టీజ‌ర్ ఆక‌ట్టుకుంది. లెజెండ్ ప్ర‌భుదేవాతో క‌లిసి ప్ర‌యాణం ఆస‌క్తిక‌రం.. ఈ పాట‌ కోసం వేచి ఉండండి అని స‌న్నీ రాసింది. టీజ‌ర్ రాక‌తో ఇప్ప‌టికే ఈ పాట‌పై అంచనాలు పెరిగాయి. సన్నీలియోన్- ప్రభుదేవా జోడీ సృష్టించబోయే డ్యాన్సింగ్ మ్యాజిక్‌ను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌భుదేవా- వేదిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న `పెట్టా రాప్` చిత్రానికి ఎస్‌.జె సిను దర్శకత్వం వహిస్తున్నారు. ఇది మ్యూజిక‌ల్ యాక్షన్ కామెడీ మూవీ. ఇందులో వివేక్ ప్రసన్న, భగవతి పెరుమాళ్, కళాభవన్ షాజోన్ ఇత‌ర‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తుండ‌గా, సన్నీ లియోన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.

పెట్టా రాప్ అనేది ఏ.ఆర్.రెహమాన్ స్వరపరచిన ప్రభుదేవా 1994 చిత్రం ప్రేమికుడు`(కాధ‌ల‌న్‌)లోనిది. పెట్టా రాప్ అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌భుదేవా- వ‌డివేలు జోడీ అద్భుత‌మైన స్టెప్పులు వేసారు ఇందులో. ఇప్పుడు అదే పాట నుండి ఈ సినిమా టైటిల్ స్ఫూర్తి పొందింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. పెట్టా రాప్ పాట‌ను ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారు.