Begin typing your search above and press return to search.

సన్నీ లియోన్‌ మూడు కార్లు నాశనం అయ్యాయి

గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా ఇండియన్ సినిమాలకే సమయం కేటాయిస్తోంది

By:  Tupaki Desk   |   10 Aug 2023 6:27 AM GMT
సన్నీ లియోన్‌ మూడు కార్లు నాశనం అయ్యాయి
X

మాజీ పోర్న్ స్టార్‌ సన్నీలియోన్ బాలీవుడ్‌ స్టార్‌ గా మారిపోయింది. గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా ఇండియన్ సినిమాలకే సమయం కేటాయిస్తోంది. అంతే కాకుండా తన మకాం ను కూడా ఇండియా కు మార్చిన విషయం తెల్సిందే. చాలా అరుదుగా మాత్రమే ఆమె తన సొంత దేశం కు వెళ్లడం మనం చూస్తున్నాం.

ముంబైలో స్థిర నివాసంను ఏర్పర్చుకున్న సన్నీ లియోన్‌ తన పిల్లలతో కలిసి చాలా సంతోషకమైన జీవితం ను సాగిస్తున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే ముంబయిలో అడుగు పెట్టిన మొదట్లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చింది. ముఖ్యంగా అంతకు ముందు ఎప్పుడు చూడని వర్షంను ముంబై లో చూశాను అంది.

సన్నీ లియోన్‌ మాట్లాడుతూ... ముంబైకి వచ్చిన మొదట్లో తాను నివాసం ఉన్న ఇల్లు సముద్రంకు దగ్గరగా ఉండేది. దాంతో కొన్ని సార్లు వచ్చిన వర్షాలు చూసి బాబోయ్‌ మరీ ఇంతగా వర్షాలు కురుస్తాయా అనుకున్నాను. అంతే కాకుండా ఆ వర్షాల వల్ల ఎప్పుడు కూడా ఇల్లంతా తేమగా ఉండేది. నా వస్తువుల వర్షాలు, తేమ వల్ల చాలా వరకు నాశనం అయ్యాయి.

ముంబైలో కురిసిన వర్షాల వల్ల నా మూడు కార్లు నాశనం అయ్యాయి. ఒకే రోజు రెండు కార్లు వర్షాల కారణంగా పాడయ్యాయి. ఇండియాకు దిగుమతి చేసుకున్న అత్యంత ఖరీదైన కార్లు వర్షాల వల్ల నాశనం అయినప్పుడు నేను చాలా బాధ పడ్డాను. కన్నీళ్లు పెట్టుకున్నాను. అయితే ఆనందించదగ్గ విషయం ఏంటి అంటే ఆ వర్షాల కారణంగా మాకు వ్యక్తిగతంగా ఏమీ అవ్వలేదు.

ప్రస్తుతం నేను ఇండియన్ వాతావరణం కు అనువైన కార్లు వాడుతున్నాను. నేను వాడుతున్న కారు ఇప్పుడు ఎలాంటి వర్షాన్ని అయినా తట్టుకుంటుందని సన్నీ చెప్పుకొచ్చింది. ఇక తన పిల్లలను వర్షంలో ఎంజాయ్‌ చేసేందుకు అనుమతిస్తాను. వారు వర్షంతో అనుబంధం ఏర్పరచుకుంటే బాగుంటుందని నేను భావిస్తాను అంది.