పట్టు చీరలో పరిమళించిన సన్నీలియోన్!
అమ్మడు తెలివిగా సౌత్ ఆడియన్స్ పల్స్ పట్టుకుని ముందుకెళ్తుంది.
By: Tupaki Desk | 22 Aug 2024 12:30 PM GMTసౌత్ లో ఎంట్రీ ఇచ్చి న నాటి నుంచి సన్ని లియోన్ లో ఎన్నో మార్పులొచ్చాయి. మునుపటిలా గ్లామర్ ట్రీట్ కి అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అలాగని పూర్తిగా దూరమవ్వడం లేదు. అవసరం మేర ఆ ర కమైన దుస్తుల్లో మెరుస్తుంది. కానీ వీలైనంత వరకూ తనలో ట్రెడీషనల్ భామనే ఎక్కువగా హైలైట్ చేస్తోంది. అమ్మడు తెలివిగా సౌత్ ఆడియన్స్ పల్స్ పట్టుకుని ముందుకెళ్తుంది.
ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో కొన్ని సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ తో పాటు సౌత్ లోనే సైమల్టేనియస్ గా పనిచేస్తోంది. అక్కడకెళ్తే అక్కడ కల్చర్ కి తగ్గట్టు...ఇక్కడ కొస్తే సౌత్ కి తగ్గట్టు నడుచుకుంటుంది. విదేశీ నుంచి దిగుమతి అయినా స్వదేశీ భామలా చాలా విషయాలు తక్కువ సమయంలోనే అమ్మడు అవపోశాన పట్టేసింది. తాజాగా అమ్మడు వెడ్డింగ్ వోవ్స్ కవర్ పేజిపై మెరిసిన వైనానికి స్టన్ అవ్వాల్సిందే.
అమ్మడు సంప్రదాయ పట్టు చీరలో పరిమళించిన తీరు చూస్తే ఆవిడి సన్నినా? అన్న సందేహం రాక మానదు. అంత అందంగా చీరందంలో తళుకులీనింది. మెరూన్ కలర్ లో ఉన్న పట్టు చీరపై మ్యాచింగ్ రవిక ధరించింది. మెడలో అందమైన ముత్యాల హారం వేసుకుంది. దీంతో నెక్ మరింత అందంగా హైలైట్ అవుతుంది. ఇక తలంతా దగ్గరకు ముడేసి కొప్పును గులీబాలు, మల్లెపూలతో అలంకరించింది.
అలా సోపా పై పరిమళింది తన మార్క్ లుక్స్ వదిలే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనేముంది. కుర్రాళ్ల గుండె ఝల్లుమనడం ఖాయం. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. సన్నీలియోన్ ట్రాన్సపర్మేషన్ చూసి అంతా స్టన్ అవుతున్నారు. ఎవరి స్టైల్లో వారు అభిమానం చాటుతున్నారు.