Begin typing your search above and press return to search.

వెండి తెర‌పై మ‌ళ్లీ స‌న్నిలియోన్ స‌చ‌ల‌నం!

అది ఐటం పాట కావొచ్చు లేదా గెస్ట్ రోల్ కావొచ్చు.

By:  Tupaki Desk   |   14 Jun 2024 6:21 AM GMT
వెండి తెర‌పై మ‌ళ్లీ స‌న్నిలియోన్ స‌చ‌ల‌నం!
X

నార్త్ నుంచి సౌత్ కి షిప్ట్ అయిన నాటి నుంచి స‌న్నిలియోన్ దూకుడు ఇక్క‌డ మామూలుగా లేదు. తెలు గులో అవ‌కాశాలంటే రావ‌డ లేదు త‌ప్ప‌! మిగ‌తా భాష‌ల్లో బాగానే సినిమాలు చేస్తోంది. గ‌త ఏడాది ఒక సినిమాకే ప‌రిమిత‌మైనా ప్ర‌స్తుతం స‌న్నీ లైన‌ప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. సౌతో లో తెలుగు మిన‌హా అన్ని భాష‌ల్లో నూ సినిమాలు చేస్తోంది. అది ఐటం పాట కావొచ్చు లేదా గెస్ట్ రోల్ కావొచ్చు.

కార‌ణం ఏదైనా స‌న్ని స్పీడ్ మాత్రం మూములుగా లేదు. క‌న్న‌డం, మ‌ల‌యాళః, త‌మిళ్ అన్ని భాష‌ల్ని క‌లిపి దున్నేస్తుంది. ప్ర‌స్తుతానికి ఓ ప‌ది ప‌న్నేండు సినిమాలు చేతిలో ఉన్నాయి. అందులో కొన్ని షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గా మ‌రికొన్ని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లోనూ ఉన్నాయి. తాజాగా ప్ర‌భుదేవా సినిమాలోనూ ఐటం భామ‌గా సైన్ చేసింది. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా త‌మిళ్ లో 'పేట‌రాప్' అనే సినిమా తెర‌కెక్కుతోంది.

ఇందులో వేదిక హీరోయిన్. ఎస్. జె శీను ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో ఐటం భామ‌గా చాలా మంది మంది భామ‌ల పేర్లు ప‌రిశీలించారు. ఈ లిస్ట్ లో కొంత మంది హీరోయిన్లు కూడా ఉన్నారు. కానీ వాళ్లంద‌ర్నీ కాద‌ని చివ‌రిగా స‌న్నిలియోన్ ని ఎంపిక చేసారు. ఇది మంచి ఎనర్జిటిక్ సాంగ్ అని ఆ పాట‌లో ప్ర‌భుదేవా ఎన‌ర్జీని స‌న్నిలియోన్ మ్యాచ్ చేయ‌గ‌ల‌ద‌ని చిత్ర యూనిట్ ఆమెని ఎంపిక చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

ఇప్ప‌టికే అమ్మ‌డు కొన్ని కోలీవుడ్ సినిమాల్లో ఐటం పాటల్లో న‌టించింది. వాటితో మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. ఈ నేప‌థ్యంలో మ‌రో ఛాన్స్ స‌న్ని కెరీర్ కి ప్ల‌స్ అయ్యే అవ‌కాశం ఉంది. ఇలా సౌత్ లో సినిమాలు చేస్తున్నా అవి తెలుగులో రిలీజ్ కాక‌పోవ‌డంతో స‌న్నిపేరు ఇక్క‌డ పెద్ద‌గా వెలుగులోకి రావ‌డం లేదు. ఆ మ‌ధ్య మంచు ఫ్యామిలీ స‌న్నిలియోన్ ని బాగానే ప్రోత్స‌హించింది. కానీ త‌దుప‌రి నిలదొక్కుకోవ‌డంలో విఫ‌ల‌మైంది.