Begin typing your search above and press return to search.

'కల్కి' కోసం సూపర్ డేట్‌ లాక్‌...!

సంక్రాంతికి సినిమాను తీసుకు రాలేక పోయిన మేకర్స్ కొత్త తేదీని ఆ పండుగ సందర్భంగా ప్రకటించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   10 Jan 2024 2:30 AM GMT
కల్కి కోసం సూపర్ డేట్‌ లాక్‌...!
X

ప్రభాస్ పాన్‌ వరల్డ్‌ మూవీ 'కల్కి ఏడి 2898' సంక్రాంతికి విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది. లేదంటే ఇప్పటి వరకు ఓ రేంజ్‌ లో కల్కి మోత మ్రోగుతూ ఉండేది. సంక్రాంతికి సినిమాను తీసుకు రాలేక పోయిన మేకర్స్ కొత్త తేదీని ఆ పండుగ సందర్భంగా ప్రకటించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

సమ్మర్ లో కల్కి సినిమా విడుదల అవ్వబోతుంది అనేది యూనిట్‌ సభ్యులు చాలా రోజుల నుంచి చెబుతున్న మాట. కల్కి సినిమా కోసం మే 9 ని ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ తేదీకి వైజయంతి మూవీస్ బ్యానర్ కి ప్రత్యేకమైన సెంటిమెంట్‌ ఉంది.

మే 9, 1990 లో టాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా విడుదల అయ్యింది. చాలా కాలం తర్వాత అంటే మే 9, 2018 లో మహానటి సినిమా విడుదల అయిన విషయం తెల్సిందే. ఇప్పుడు అదే తేదీని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతికి ఆ విషయాన్ని అధికారికంగా క్లారిటీ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట.

కల్కి సినిమా ను మే 9న విడుదల చేద్దామనే ఉద్దేశ్యంతో ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకునే హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాలో దిశా పటానీ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే. కమల్‌ హాసన్‌ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.