Begin typing your search above and press return to search.

సూపర్‌ హిట్‌ మూవీ సీక్వెల్‌ 'సైడ్‌ - B' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

తెలుగు లో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిన సమయంలో కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   20 Oct 2023 8:43 AM GMT
సూపర్‌ హిట్‌ మూవీ సీక్వెల్‌ సైడ్‌ - B రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌
X

ఈ మధ్య కన్నడ సినిమాలు భారీ విజయాలను అందుకుంటున్నారు. కన్నడంలోనే కాకుండా బయటి భాషల్లో కూడా కొన్ని సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకుంటూ పాన్‌ ఇండియా సినిమాలుగా నిలుస్తూ భారీ వసూళ్లు నమోదు చేస్తున్నాయి. అయిదు ఆరు సంవత్సరాలకు ముందు పాతిక కోట్ల వసూళ్లు సాధిస్తే గొప్ప విషయం అన్నట్లుగా కన్నడ సినీ పరిశ్రమలో పరిస్థితి ఉండేది. ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారిపోయింది.

కన్నడ సినిమాలు వందల కోట్లు వసూళ్లు నమోదు చేస్తున్నాయి. పది కోట్ల లోపు బడ్జెట్‌ తో రూపొందిన సినిమాలు కూడా వందల కోట్ల వసూళ్లు నమోదు చేస్తున్నాయి. తాజాగా కన్నడం లో వచ్చిన సప్త సాగరాలు దాటి సినిమాకు మంచి స్పందన వచ్చింది. రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్‌ జంటగా నటించిన ఈ సినిమాకి అక్కడ తక్కువ సమయంలోనే వంద కోట్ల వసూళ్లు నమోదు అవ్వడంతో వెంటనే తెలుగు లో డబ్‌ చేసి విడుదల చేశారు.

తెలుగు లో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిన సమయంలో కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సైడ్‌ బి అంటే సీక్వెల్‌ అదేనండి రెండో భాగం రాబోతుంది. సినిమా మొదటి పార్ట్‌ లోనే దర్శకుడు హేమంత్ ఎం రావు రెండో పార్ట్‌ ఉంటుందని క్లారిటీగా చెప్పడం అందరికి తేల్సిందే.

మొదటి భాగం గురించి ఇంకా చర్చ జరుగుతూ ఉండగానే సైడ్‌ బి అంటూ రెండో పార్ట్‌ విడుదలకు సంబంధించిన తేదీ ని దర్శకుడు హేమంత్ ఇచ్చేశాడు. నవంబర్‌ 17వ తారీకున సప్తసాగరాలు దాటి సైడ్‌ బి ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈసారి కన్నడ తో పాటు తెలుగు ఇతర భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల అవ్వబోతుంది.