Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ పవర్ఫుల్ లైనప్.. టార్గెట్ 1000 కోట్లు!

ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సూపర్ స్టార్ రజినీకాంత్ సాలిడ్ లైన్ అప్ పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఒకదానిని మించి ఒకటి ఉంటాయనే టాక్ నడుస్తోంది.

By:  Tupaki Desk   |   9 Oct 2024 2:30 AM GMT
సూపర్ స్టార్ పవర్ఫుల్ లైనప్.. టార్గెట్ 1000 కోట్లు!
X

సూపర్ స్టార్ రజినీకాంత్ గత ఏడాది 'జైలర్' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. 'రోబో' తర్వాత ఆయన నుంచి ప్రేక్షకులు కోరుకునే ఎలివేషన్ తో వచ్చిన ఈ మూవీ 600 కోట్లకి పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. కోలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితాలో మొదటి స్థానంలో 'రోబో 2.ఓ' ఉంటే రెండో స్థానంలో 'లియో' మూవీ నిలిచింది. దీని తర్వాత టాప్ 3గా 'జైలర్' మూవీ ఉండటం విశేషం.

సూపర్ స్టార్ రజినీకాంత్ 'వేట్టయన్' మూవీ తో అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. టీజే జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. 'జై భీమ్' మూవీతో అందరి దృష్టిని ఆకర్షించిన టీజే జ్ఞాన్ వేల్ తన స్టైల్ లోనే సోషల్ కాన్సెప్ట్ మిక్స్ చేసి 'వేట్టయన్' మూవీ తెరకెక్కించారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో కూడా అదే పేరుతో మూవీ రిలీజ్ అవుతోంది.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఐదు భాషలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా పైన ఫ్యాన్స్ మరీ ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేదు. టీజే జ్ఞాన్ వేల్ గత సినిమాల ట్రాక్ రికార్డ్ ని దృష్టిలో ఉంచుకొని వేట్టయన్ కూడా రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తితో రాసుకున్న కథతోనే ఉండొచ్చని అనుకుంటున్నారు. హెవీ కమర్షియల్ ఎలివేషన్స్ ఉంటాయని భావించడం లేదు. అయితే అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తూ ఉండటంతో కొంత హైప్ ఉంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పైన మాత్ర భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీని తర్వాత నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో 'జైలర్' మూవీ సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నారు. ఈ మూవీ కంప్లీట్ చేసిన తర్వాత మణిరత్నం దర్శకత్వంలో రజినీకాంత్ సినిమా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. 33 ఏళ్ళ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోందని కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.

ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సూపర్ స్టార్ రజినీకాంత్ సాలిడ్ లైన్ అప్ పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఒకదానిని మించి ఒకటి ఉంటాయనే టాక్ నడుస్తోంది. సూపర్ స్టార్ కి పోటీ ఇచ్చే రేంజ్ లో ఏ హీరో కూడా ప్రస్తుతం కోలీవుడ్ లో ఎవరు లేరు. ఈ నేపథ్యంలో తమిళంలో మొదటి 1000 కోట్ల కలెక్షన్స్ చిత్రం సూపర్ స్టార్ నుంచే వస్తుందని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.